Woman: నది పక్కన మహిళను గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఫ్రెండ్స్, చేపల వలతో చిక్కిన కామాంధులు !
చెన్నై/తంజావూర్: వివాహిత మహిళ కన్ను వేసిన ఇద్దరు కమాంధులు ఆమెను ఎలాగైనా అనుభవించాలని ఎదురు చూశారు. వివాహిత మహిళ ప్రతిరోజూ గొర్రెలను మేపడానికి అటవి ప్రాంతం సమీపంలోకి వెలుతోంది. ఎప్పటిలాగే ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరిన ఆమె గొర్రెలను తోలుకుని నది సమీపంలోని అటవి ప్రాంతానికి వెళ్లింది. రాత్రి పొద్దుపోయిన తరువాత గొర్రెలు మాత్రమే ఇంటిక వెళ్లాయి. వివాహిత మహిళ ఆచూకి లేకపోవడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అటవి ప్రాంతంలోకి వెళ్లి గాలించారు. ఓ ప్రాంతంలో మహిళ చెప్పులు పడి ఉన్నాయి. కొంత దూరంలో కొడవలి పడి ఉంది. నది సమీపంలో కనపడకుండా పోయిన మహిళ నగ్నంగా శవమై కనిపించడంతో అందరూ హడలిపోయాడు. పోలీసులు మహిళ శవాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. మహిళ మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసులు ఇద్దరు చేపలు పట్టే కామాంధులను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

వివాహిత మహిళ
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని అమ్మాపేటై సమీపంలోని సుజియాకోటైలో 30 సంవత్సరాల వివాహిత మహిళ నివాసం ఉంటున్నది. వివాహిత మహిళ భర్త, అతని కుటుంబ సభ్యులు వ్యవసాయం చేస్తున్నారు. వివాహిత మహిళ కుటుంబ సభ్యులు చాలా గొర్రెలను మేపుతూ వాటిని విక్రయించి మళ్లీ చిన్న గొర్రె పిల్లలను కొనుగోలు చేస్తుంటారు. ఇంట్లో ఉన్న గొర్రెలను వివాహిత మహిళ ప్రతిరోజు అటవి ప్రాంతంలోకి తోలుకుని వెలుతోంది.

కామాంధుల కన్నుపడింది
అమ్మాపేటై సమీపంలోని మరో గ్రామంలో పెరియస్వామి (30), సతీష్ (25) అనే ఇద్దరు యువకులు నివాసం ఉంటున్నారు. సతీష్, పెరియస్వామి అమ్మాపేటై సమీపంలోని నదిలో చేపలు పడుతూ వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. చాలా కాలం నుంచి వివాహిత మహిళ మీద సతీష్, పెరియస్వామి కన్నువేశారు.

చాన్స్ కోసం ఎదురు చూశారు
వివాహిత మహిళ కన్ను వేసిన కమాంధులు పెరియస్వామి, సతీష్ ఆమెను ఎలాగైనా అనుభవించాలని ఎదురు చూశారు. వివాహిత మహిళ ప్రతిరోజూ గొర్రెలను మేపడానికి అటవి ప్రాంతం సమీపంలోకి వెలుతోంది. ఎప్పటిలాగే ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరిన ఆమె గొర్రెలను తోలుకుని నది సమీపంలోని అటవి ప్రాంతానికి వెళ్లింది. మహిళ మాత్రమే ఒంటరిగా గొర్రెలను తోలుకుని వచ్చిన విషయం సమీపంలోని నదిలో చేపలు పడుతున్న సతీష్, పెరియస్వామి చూశారు.

అత్యాచారం చేసి కొడవలితో నరికి చంపేశారు
వివాహిత మహిళ దగ్గరకు వెళ్లిన కామాంధులు మా కోరిక తీర్చాలని చెప్పారు. వివాహిత మహిళ ఎదురుతిరిగింది. ఆ సమయంలో ఆమెను అటవి ప్రాంతంలో పొదల్లోకి లాక్కెళ్లిన సతీష్, పెరియస్వామి ఆమె మీద అత్యాచారం చేశారు. ఈమెను ప్రాణాలతో వదిలేస్తే ఊరిలో అందరికి చెబుతుందని, పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆమెను చంపేశారు.

చేపల వల వదిలేసి వెళ్లిపోయారు
రేప్ చేసి చంపేసిన తరువాత మహిళ శవాన్ని తీసుకెళ్లి పొదల్లో విసిరేసిన సతీష్, పెరియస్వామి అక్కడి నుంచి పరారైనారు. నిందితులు పారిపోతున్న సమయంలో చేపలు పట్టడానికి వారు తీసుకెళ్లిన వలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రాత్రి పొద్దుపోయిన తరువాత గొర్రెలు మాత్రమే ఇంటిక వెళ్లాయి. వివాహిత మహిళ ఆచూకి లేకపోవడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అటవి ప్రాంతంలోకి వెళ్లి గాలించారు. ఓ ప్రాంతంలో మహిళ చెప్పులు పడి ఉన్నాయి.

నిందితులను పట్టించిన చేపల వల
పోలీసులు మహిళ శవాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో మహిళ హత్యకు గురైన ప్రాంతం సమీపంలో చేపలు పట్టే వలను గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆ చేపల వల సతీష్, పెరియస్వామి ఉపయోగిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వివాహిత మహిళ మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. మహిళ మీద గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసులు నది సమీపంలో దాక్కొని ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే కాలం గడుపుతున్న సతీష్, పెరియస్వామి అనే ఇద్దరు చేపలు పట్టే కామాంధులను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications