దారుణం: చికిత్స కోసం వచ్చిన మహిళపై అత్యాచారం

న్యూఢిల్లీ: డిప్రెషన్‌తో బాదఫడుతున్న ఓ మహిళ (22) చికిత్స కోసం ఆసుపత్రి వెళితే వార్డుబాయ్, సెక్యూరిటీ గార్డు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన గుర్గావ్‌కు సమీపంలోని హర్యానా జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం మేవాత్ జిల్లాలోని ఎస్‌హెచ్‌కేఎమ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలోని ఐదో అంతస్తులోని వార్డు నెంబర్. 17లో చికిత్స పొందుతున్న బాధితురాలని రాత్రి 11.30 గంటల సమయంలో వార్డు బాయ్ బయటకు రమ్మని పిలిచాడు.

ఆమె వార్డు బయటకు వచ్చి తన బంధువులు ఉన్న లాంజ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, వార్డు బాయ్ పక్కనే ఖాళీగా ఉన్న ఓ రూమ్ లోకి ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు కూడా వార్డు బాయ్‌తో పాటు రూమ్ లోకి వెళ్లాడు. ఇద్దరూ కలసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆమెపై సుమారు రెండు గంటల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. కొద్ది సేపటి తర్వాత వార్డులో లాంచ్‌లో ఉన్న బాధితురాలు బావ ఆమె వార్డులో లేని విషయాన్ని గుర్తించాడు. అంతేకాదు నిందితులు ఆమెను తీసుకెళ్లిన గది బయట ఆమె వస్తువులు పడి ఉన్న విషయాన్ని గుర్తించి అలారమ్ మోగించాడు.

Woman raped in hospital by ward boy, guard

దీంతో వార్డు బాయ్, సెక్యూరిటీ గార్డు అక్కడి నుంచి పారిపోయారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో బాధితురాలి తరుపు బంధువులు జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారమందిచారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రికి చేరుకుని నిందితులను గుర్తించి, వారిపై కేసు నమోదు చేశారు.

పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఆసుపత్రి డైరెక్టర్ శన్సర్ చంద్ శర్మ మాట్లాడుతూ ఇది చాలా దారుణమైన ఘటన అని, నిందితులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.

బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. జూన్ 2వ తేదీన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. కాగా గుర్గావ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్‌హెచ్‌కేఎమ్ ప్రభుత్వ ఆసుపత్రిని 2012లో 400 బెడ్స్‌తో ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+