ప్రభుత్వఉద్యోగి భార్యపై లాయర్, కానిస్టేబుల్ అత్యాచారం
లక్నో: ముప్పై ఏళ్ల ఓ యువతి పైన ఓ లాయరు, ఓ కానిస్టేబుల్ అత్యాచారనికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని పోలీసులు శుక్రవారం తెలిపారు. సమాజంలో శాంతిభద్రతలు, చట్టాన్ని కాపాడాల్సిన ఆ ఇద్దరూ ఓ మహిళపై అఘాత్యానికి పాల్పడ్డారు.
బదోనీ ప్రాంతంలోని పోలీస్ లైన్స్ వద్ద ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య పైన లాయర్ జైప్రకాశ్ యాదవ్, కానిస్టేబుల్ రామ్ ఆశిష్ సింగ్ అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. ఈ వ్యవహారంలో జ్ఞాన్ పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలింపు చేపట్టారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అత్యాచారాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. వీటిపై విపక్షాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం కూడా అత్యాచారాల పైన చర్యలకు ఉపక్రమించింది.












Click it and Unblock the Notifications