Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్ : కదులుతున్న బస్సులో మహిళపై రెండుసార్లు అత్యాచారం...

ఇటీవలి కాలంలో భారత్‌లో మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. గత వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్‌లలో పలు దారుణ అత్యాచార,హత్యాచార ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా మహారాష్ట్రలోనూ ఓ అత్యాచార ఘటన వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు అత్యాచారానికి గురైంది.

బాధితురాలి కథనం ప్రకారం... నాగ్‌పూర్ నుంచి పుణే వెళ్లేందుకు గుడ్‌విల్ ట్రావెల్స్‌కి చెందిన ఓ లగ్జరీ బస్సులో ఆమె బయలుదేరింది. మొదట సీటు నంబర్.5లో ఆమె కూర్చోగా... బస్సు క్లీనర్ ఆమెను సీటు నంబర్.15లో కూర్చోవాలని చెప్పాడు. దీంతో ఆ సీటులోకి మారింది. ఆ తర్వాత క్లీనర్ ఆమెపై బలవంతంగా రెండుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నోరు తెరిస్తే చంపేస్తానని,బస్సు నుంచి బయటకు విసిరేస్తానని బెదిరించాడు.

Woman raped twice inside moving luxury bus in Maharashtra

మరుసటి రోజు పుణేలోని రాజ్‌నగావ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఘటన జరిగిన వషీం జిల్లాలో కావడంతో పుణే పోలీసులు కేసును అక్కడికి బదిలీ చేశారు. ఆపై అక్కడి పోలీసులు గుడ్‌విల్ బస్సు క్లీనర్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా,ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బదౌని జిల్లా ఉఘాటికి చెందిన 50 ఏళ్ల ఓ మహిళ ఆదివారం(జనవరి 3)పై స్థానిక పూజారి,అతని ఇద్దరు అనుచరులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడిన సంగతి తెలిసిందే. రేప్ సమయంలో ఆమె జననాంగాల్లో ఇనుప రాడ్లు దూర్చి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ మహిళ మృతి చెందింది. బదౌని ఘటన మరవకముందే తరహాలో జార్ఖండ్‌లో మరో దారణం చోటు చేసుకుంది. చత్రా జిల్లాలోని కోబ్నా గ్రామంలో 50 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె జననాంగాల్లో స్టీల్ గ్లాసును దూర్చి చిత్రహింసలకు గురిచేశారు.బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

గత శనివారం(జనవరి 9) మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఉన్న అమిలియా పట్టణంలో 45 ఏళ్ల ఓ వితంతువుపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇనుప రాడ్డుతో ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+