ఆడో సైకో .. అక్రమ సంబంధానికి అమ్మ వద్దంది, కూతురి కిడ్నాప్
న్యూఢిల్లీ : సమాజంలో వింత పోకడలు జరుగుతున్నాయి. ప్రేమ అంటే .. ఇద్దరు టీనేజీ యువతీ, యువకులు మాత్రమే. కానీ నేడు ట్రెండ్ మారింది. ఆంటీలను అబ్బాయిలు ఇష్టపడుతున్నారు. లైక్ చేయడమే కాదు .. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారు. ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ మన వీర ప్రేమికుడు ఆ మహిళ కూతురిని కిడ్నాప్ చేయడం హైలెట్. పోలీసులు ఆ కేసును 24 గంటల్లో చేధించి .. భగ్న ప్రేమికుడిని కటకటాల్లోకి నెట్టారు.
పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి ..
ఢిల్లీకి చెందిన మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే ఆమెకు ఇటీవల కమలేశ్ అనే మెకానిక్ పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. అతని ప్రతిపాదనను మహిళ తోసిపుచ్చింది. కానీ మనోడిది వన్ సైడ్ లవ్. మరి ఆంటీని పెళ్లిచేసుకోవాలనే ఉబలాటం ఎక్కువైంది. ఏం చేయాలని ఆలోచించాడు. ఇంకేముంది మెదడులో కిడ్నాప్ అనే ఆలోచన తట్టింది. వెంటనే మహిళ చిన్న కూతురిని కిడ్నాప్ చేశాడు. తన తొమ్మిదేళ్ల కూతురు షాపుకెళ్లి తిరిగిరాకపోవడంతో మహిళ విజయ్ విహార్ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలించారు. గంటలు గడుస్తోన్న కిడ్నాపర్ల నుంచి మహిళకు ఫోన్ రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని ఆలోచించారు. సీసీ టీవీ ఫుటేజీ తీశారు.

కూతురు కిడ్నాప్
అందులో బాలికతోపాటు కమలేశ్ కనిపించాడు. అతను మీకు తెలుసా అని అడిగారు. అప్పుడు నిజం బయటపడింది. ఇదివరకు తాను పనిచేసే వద్దకు వచ్చేవాడని తెలిపింది. అంతేకాదు తనను పెళ్లిచేసుకోవాలని ప్రతిపాదన తీసుకొచ్చాడని వివరించింది. తాను కాదని, పెళ్లిచేసుకోనని తెగేసి చెప్పామని పేర్కొంది. దీంతో తనపై కక్షగట్టి తన కూతురిని కిడ్నాప్ చేశాడని వాపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి .. కమలేశ్ బారి నుంచి బాలికను రక్షించారు. కిడ్నాప్ తతంగం గురించి కమలేశ్‌ని అడిగితే .. మహిళను తాను ప్రేమిస్తున్నానని సెలవిచ్చాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే .. తిరస్కరించిందని .. తన కూతురిని కిడ్నాప్ చేసి ఒత్తిడి తీసుకొస్తే దారిలోకి వస్తుందని ఆశించానని పేర్కొన్నాడు. బాధితురాలు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని యాంగిళ్లలో విచారించి .. కమలేశ్‌తో ఉన్న బాలికను సురక్షితంగా కాపాడారు. తర్వాత మహిళకు కూతురిని ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.












Click it and Unblock the Notifications