చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కదులుతున్న సిటీ బస్సులో మహిళకు తెలీకుండానే రూ. లక్ష లూటీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: వేగంగా వెలుతున్న సిటీ బస్సులో మహిళ వ్యానిటీ బ్యాగ్ లో ఉన్న లక్ష రుపాయాల నగదు లూటీ అయిన ఘటన చెన్నై నగరంలో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో చెన్నైలోని సెవన్ వెల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేశారు.

చెన్నై నగరంలోని మహాకవి భారతీ నగర్ లో భాగ్యమ్మ అలియాస్ భాగ్యమ్ అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె తన బంధవుల దగ్గర ప్రయివేటు చీటి వేశారు. భాగ్యమ్ చీటి వేసిన బంధువు దగ్గర లక్ష రూపాయల నగదు తీసుకుని ఇంటికి బయలుదేరారు.

Woman robbed of Rs one lakh inside moving bus in Tamil Nadu

చెన్నై మెట్రోపాలిటిన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఎంటీసీ) సిటీ బస్సు రూట్ నెంబర్ 116లో తన బంధువుతో కలిసి భాగ్యమ్ ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉందని సమాచారం.

మార్గం మధ్యలో భాగ్యమ్ కు అనుమానం వచ్చి తన బ్యాగ్ ను పరిశీలించింది. బ్యాగ్ లో లక్ష రూపాయల నగదు మాయం అయిన విషయం గుర్తించి సెవన్ వెల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్సులో పిక్ ప్యాకెట్ జరిగి ఉంటుందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
Sources said Bhagyam, a resident of Mahakavi Bharathi Nagar, was a member of a chit fund scheme ran by a relative of her. On Tuesday, she collected Rs one lakh money from the relative and took MTC bus of route number 116.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X