గొడవలతో హత్య: సంచీలో మహిళ శవం, భర్త అరెస్టు
న్యూఢిల్లీ: భార్యను హత్య చేసి సంచీలో పెట్టి మెట్రో స్టేషన్ వద్ద పడేసిన పాతికేళ్ల వ్యక్తిని పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. వైవాహిక జీవితంలో తగాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.
నీతు అనే 23 ఏళ్ల మహిళ శవం మయూర్ వివాహార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ ట్రాలీ బ్యాగ్‌లో మంగళవారం ఉదయం బయటపడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో తన భర్త ఓం ప్రకాష్‌తో పాటు నివసించే నీతు కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని కళ్యాణపురి ప్రాంతంలో గల తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది.

టెలీకమ్ సర్వీస్ ప్రొవైడర్‌గా పనిచేస్తున్న ఓం ప్రకాష్ నీతును ఈ నెల 21వ తేదీన నోయిడాలో తనను కలుసుకోవాలని చెప్పాడు. అయితే, ఆమె తన వద్దకు రాలేదని ఓం ప్రకాష్ చెప్పాడు. దాంతో పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అనుమానం వచ్చి ఓం ప్రకాష్‌ను పోలీసులు ప్రశ్నించారు. దీంతో అతను తన నేరాన్ని అంగీకరించాడు. భార్యను తానే చంపినట్లు ఓం ప్రకాష్ అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications