లాతూర్‌లో సతీ సహగమనం: భర్త చితిపై సగం కాలిన భార్య మృతదేహం
ముంబై: మహారాష్ట్రలోని లాతూర్‌లో భర్త చితిపై సగానికిపైగా కాలిపోయిన భార్య మృతదేహం కనిపించడం కలకలం సృష్టించింది. సతీసహగమనం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. తుకారాం మానె(55) సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోవడంతో ఆయన భౌతికకాయానికి అదేరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఆరోజు సాయంత్రం నుంచి ఆయన భార్య ఉష(50) అదృశ్యమయ్యారు.

తుకారాం అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి మంగళవారం మధ్యాహ్నం బంధువులు వెళ్లి చూడగా.. తుకారాం చితివద్ద సగానికి పైగా కాలిపోయిన మరోశవం పడి ఉంది. పరిశీలించగా అది ఉషదిగా తేలింది.
కాగా, ఉష మరణం మిస్టరీగా మారింది. సతీసహగమనం పేరిట ఆమెను సజీవంగా భర్త చితిలో తోసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications