భర్తకు అనారోగ్యం: చికిత్స కోసం రూ. 45వేలకు కొడుకు విక్రయం

Posted By:
Subscribe to Oneindia Telugu
  భర్త కోసం రూ. 45వేలకు కొడుకు విక్రయం, వీడియో !

  లక్నో: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్తకు చికిత్స చేయించేందుకు కన్న కొడుకును రూ. 45 వేలకు విక్రయించింది ఓ తల్లి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా ఢాకియా కోహ్ గ్రామానికి చెందిన హర స్వరూప్ మౌర్య, సంజుదేవీలు భార్య, భర్తలు. మౌర్య భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేసేవాడు.

  ఓ ఇంటి నిర్మాణ పనిలో ఉండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మౌర్య తీవ్రంగా గాయపడ్డాడు. మూడు నెలలుగా మౌర్య ఆసుపత్రిలో ఉన్నాడు. భర్త మంచాన పడ్డాడు.దీంతో పూట గడవడం కూడ ఆ కుటుంబానికి కష్టంగా మారింది. అప్పటికే గర్భవతిగా ఉన్న సంజు దేవి మగబిడ్డకు జన్మనిచ్చింది.

  అయితే భర్తకు వైద్యం చేయించేందుకు తన 15 ఏళ్ళ బిడ్డను రూ.45 వేలకు విక్రయించింది ఆ తల్లి. మౌర్య కుటుంబాన్ని తాము ఆదుకొంటామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In a shocking incident, a woman in Uttar Pradesh sold her 15-day-old child to gather money for the treatment of her ailing husband. She sold her child for a sum of Rs 45,000.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి