మహిళ కాల్చివేత: భర్త ముందే నగదు లూటీ
ఉత్తరప్రదేశ్: డబ్బు లూటీ చెయ్యడానికి వచ్చిన దుండగులు మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మహిళను ఆమె కుటుంబ సభ్యుల ముందే హత్య చేసిన నిందితులు రూ. రెండు లక్షలు లూటీ చేసి అక్కడి నుంచి పరారైనారని పోలీసులు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లోని లిఖింపూర్ ప్రాంతంలో ఆశిష్ కుమార్, ఆర్తీ దేవి (35), తమ రెండేళ్ల కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవల ఆశిష్ కుమార్ భూమిని కొనుకున్నాడు. బుధవారం అశిష్ కుమార్ అతని భార్య, కుమారుడు, సమీప బంధువుతో కలిసి ప్రయాణిస్తున్నాడు. వీరి దగ్గర రూ. రెండు లక్షలు డబ్బు ఉంది.

మార్గం మధ్యలో పూల్ బెహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు దుండగులు వీరిని అడ్డగించారు. ఆశిష్ కుమార్ దగ్గర ఉన్న రూ. రెండు లక్షలు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆ సందర్బంలో ముగ్గురు దుండగుల్లో ఒకరిని ఆర్తీ దేవి గుర్తు పట్టింది. అతనిని పేరు పెట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించింది.
అంతే దుండగుడు జోబులో ఉన్న రివాల్వర్ బయటకు తీసి ఆర్తీ దేవి మీద కాల్పులు జరపడంతో ఆమె అక్కడే మరణించింది. తాము ఇటీవల భూమి కొనుక్కున్నామని, ఆ భూమి రిజిస్టర్ చేయించుకోవడానికి వెలుతున్న సమయంలో దుండగులు నగదు లూటీ చేసి తన భార్యను హత్య చేశారని ఆశిష్ కుమార్ ఫిర్యాదు చేశాడని, కేసు నమోదు చేశామని డీఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications