నడిరోడ్డుపై పోలీసు చెంప చెళ్లుమనిపించిన యువతి
లక్నో: పోలీసు అధికారై ఉండి, పట్టపగలే కనిపించిన ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు. దీంతో తిరిగబడిన ఆ మహిళ పోలీసు అని కూడా చూడకుండా నడిరోడ్డుపై ఆ పోలీసు చెంప చెళ్లుమనిపించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన మహిళను గత కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నాడు. కొన్నాళ్లపాటు భరించిన ఆమె ఇక తట్టుకోలేక పోయింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే పోలీసు కాలర్ పట్టుకుని ఈడ్చి ఈడ్చి కొట్టింది.

కోపంతో చెంపలు చెళ్లుమనిపించింది. మహిళ దెబ్బలకు బెదిరిన ఆ పోలీసు అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వివరాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ఘటన అనంతరం మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వేధింపుల పోలీసు అధికారిపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications