యువతిని లక్షకు అమ్మారు, ఒక్కరోజే 35మంది: వక్షోజాలు కాల్చారు
ముంబై: ఓ యువతికి ఉద్యోగం ఆశ చూపించి, నగరానికి తీసుకు వచ్చిన ఆమెను లక్ష రూపాయలకు అమ్మేశారు. ఆమెను బీవండిలోని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశారు. ఆమెను కొన్నవారు ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపారు. ఒకేరోజు ఏకంగా 35 మంది విటులను ఆమె వద్దకు పంపించారు.
ఈ సంఘటన శనివారం నాడు వెలుగు చూసింది. ఓ సమయంలో ఆమెను ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకు వెళ్లారు. అక్కడి నుండి ఆమె పారిపోయింది. ఆమెను కొందరు పోలీసులకు అప్పగించారు. బాధితురాలు నిందితుల గురించి చెప్పింది.

ఇటీవలి కాలంలో ఇలాంటి విషాద సంఘటన బీవండిలో జరగడం ఇది రెండోసారి అని చెబుతున్నారు. గత ఏడాది ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నుండి తీసుకు వచ్చారు. ఆమెకు ఉద్యోగం ఆశను చూపించారు.
ఉద్యోగం ఆశతో ఆమె వారితో వచ్చింది. ఇక్కడకు వచ్చాక ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపే ప్రయత్నం చేశారు. ఆమె అందుకు నిరాకరించింది. దీంతో వారు ఆమె పట్ల కిరాతకంగా వ్యవహరించారు. ఆమె వక్షోజాలను, ఇతర ప్రయివేటు పార్ట్‌లను సిగరేట్లతో కాల్చారు.












Click it and Unblock the Notifications