తల్లీ, కుమారుడిని పొడిచి చంపేశాడు

న్యూఢిల్లీ: పాత కక్షల కారణంగా తల్లీ, కుమారుడిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో జరిగింది. రెండు హత్యలు చేసిన నిందితుడు అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని పోలీసు అధికారులు చెప్పారు.

పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బీహార్ కు చెందిన రాంజీ, అంజుదేవి (40) దంపతులు, శ్యామ్ సింగ్ కుటుంబ సభ్యులు ఢిల్లీ చేరుకుని నివాసం ఉంటున్నారు. అంజుదేవి కుమారుడు ప్రశాంత్ (16). అంజుదేవి కుమార్తె కోల్ కతాలో చదువుకుంటున్నది.

రాంజీ, శ్యామ్ సింగ్ కుటుంబ సభ్యులు అన్యోన్యంగా ఉండేవారు. రాంజీ చిరు వ్యాపారి. మంగళవారం మద్యాహ్నాం అంజుదేవి పక్కింటి మహిళతో మాట్లాడుతున్నది. ప్రశాంత్ ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో శ్యామ్ సింగ్ వారి ఇంటిలోకి వెళ్లాడు. తెలిసిన వ్యక్తి అని ప్రశాంత్ అభ్యంతరం చెప్పలేదు.

 woman, son stabbed to death in New Delhi

శ్యామ్ సింగ్ నేరుగా వంట గదిలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న కత్తి తీసుకు వచ్చి ప్రశాంత్ గొంతులో ఏడు సార్లు పొడిచాడు. కుమారుడి కేకలు విని అంజుదేవి ఇంటిలోకి పరుగు తీసింది. అప్పటికే రక్తపుమడుగులో ప్రశాంత్ కిందపడి విలవిలలాడుతున్నారు. షాక్ లో ఉన్న అంజుదేవి కడుపులో 8 సార్లు దాడి చేశాడు.

ఇద్దరి కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. చిక్కిపోతామని భయపడిన శ్యామ్ సింగ్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రశాంత్ సంఘటనా స్థలంలో మరణించాడు. ఆసుపత్రిలో అంజుదేవి మరణించింది. శ్యామ్ సింగ్ చికిత్స పొందుతున్నాడని, పాతకక్షల కారణంగా జంట హత్యలు జరిగాయని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+