ఢిల్లీలో దారుణం: భార్యను 30 సార్లు పొడిచిన భర్త, అడ్డుపడ్డ కొడుకు.. అయినా..
ఢిల్లీలో దారుణం జరిగిపోయింది. కట్టుకున్న భార్యను ఆమె భర్త కత్తిపోట్లతో కడతేర్చాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ముఫైసార్లు భార్యను కత్తితో పొడిచి చంపాడా భర్త.
ఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఆమె భర్త కత్తిపోట్లతో కడతేర్చాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 సార్లు భార్యను కత్తితో పొడిచి చంపాడా భర్త.
భార్యపై అనుమానమే హత్యకు గల కారణంగా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. పశ్చిమ ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న వినోద్(43) అనే వ్యక్తి వివాహాలు జరిపించే చిన్న సంస్థను నడుపుతున్నాడు.
ఇతనికి భార్య, టీనేజ్ కుమారుడు ఉన్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెరిగిన వినోద్ ఆమెను అతి దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటనను అడ్డుకోబోయిన కొడుకును సైతం పొడిచి గాయపరిచాడు.
బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. మరోవైపు నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications