ఎంపీని ట్రాప్ చేసిన మాయాలేడీని అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ ఎంపి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన ఓ మహిళను ఎట్టకేలకు మంగళవారం నాడు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఓ ఎంపి తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన ఓ మహిళను ఎట్టకేలకు మంగళవారం నాడు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ బిజెపి ఎంపీపై ఆ మహిళ ఆరోపణలు చేసింది. అయితే తనను ట్రాప్ చేసి ఓ మహిళ బ్లాక్ మెయిల్ చేసిందని బిజెపి ఎంపీ ఆరోపించారు.అయితే అతను న్యూఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళ కూడ స్పందించింది. ఆ ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించింది.ఈ మేరకు తన వద్ద సీడీ కూడ ఉందని చెప్పింది.
అయితే ఆ మహిళ పలువురు ఎంపీలను ఇదే రకంగా వేధిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం నాడు ఘజియాబాద్ లోని ఆమెను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. అయితే ఆమె ఇదే రకంగా పలువురిని బ్లాక్ మెయిల్ చేసిందని .పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications