వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సిజన్ కోసం... మోకాళ్లపై కూలబడి చేతులు జోడించి వేడుకోలు... ఇంతలోనే తల్లి చనిపోయిందని ఫోన్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో కరోనా పేషెంట్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు పలుమార్లు కేంద్రాన్ని హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించట్లేదు. గత వారం సర్ గంగారాం ఆస్పత్రిలో 25 మంది,జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది పేషెంట్లు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆక్సిజన్ కొరతకు అద్దం పట్టే మరో సంఘటన గురువారం(ఏప్రిల్ 29) చోటు చేసుకుంది.

ఢిల్లీలోని ఓ ఆక్సిజన్ సెంటర్ వద్ద గురువారం(ఏప్రిల్ 29) శృతి సాహా అనే ఓ యువతి క్యూ లైన్‌లో నిలబడింది. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన శృతి తల్లి ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స పొందుతోంది. ఇంకా కొద్ది గంటలకే సరిపోయే ఆక్సిజన్ ఉండటంతో.. గురువారం ఆమె ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఢిల్లీలో చాలాచోట్ల వెతికింది. చివరకు శాబీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్దకు చేరుకుని అక్కడ క్యూ లైన్‌లో నిలుచుంది. అయితే గంటల పాటు నిరీక్షించినప్పటికీ అక్కడి ఆక్సిజన్ ప్లాంట్ తలుపులు తెరవలేదు.

 woman who stands in queue for oxygen broke down after hears mothers death

ఓవైపు తల్లికి ఆక్సిజన్ అయిపోతోంది... మరోవైపు ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ఆలస్యమవుతోంది... దీంతో శృతి సాహా మోకాళ్లపై కూలబడి రెండు చేతులు జోడించి అక్కడి సిబ్బందిని బతిమాలింది. దయచేసి తనకు త్వరగా ఆక్సిజన్ ఇప్పించాలని కోరింది. సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఇంకాసేపు ఎదురుచూడక తప్పదని ఆమెతో చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శృతికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. తన తల్లి ఇక లేరన్న వార్త విని ఆమె దిగ్భ్రాంతికి గురైంది. అక్కడే కూలబడి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో క్యూ లైన్‌లో ఉన్న మిగతావాళ్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

'మధ్యాహ్నం 2 గంటల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. ఢిల్లీలో అసలెక్కడా ఆక్సిజన్ దొరకట్లేదు. చివరకు ఈ ఇండస్ట్రీ వద్దకు వచ్చినప్పటికీ ఆక్సిజన్ దొరకడంలో ఆలస్యమైంది. అప్పటికీ మా అమ్మ చాలా సీరియస్‌గా ఉన్నారని ఆక్సిజన్ ప్లాంట్ సిబ్బందితో చెబుతూనే ఉన్నాను.' అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓవైపు ఢిల్లీలో తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొనగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి తగినంత ఆక్సిజన్ కేటాయించామని ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా పేర్కొంది. అయితే హైకోర్టు మాత్రం ఆ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. ఢిల్లీ కంటే మిగతా రాష్ట్రాలకు ఎక్కువ ఆక్సిజన్ అందుతోందన్న ఢిల్లీ ప్రభుత్వ ఆరోపణలపై కేంద్రం స్పందించాలని కోరింది.

ఆస్పత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్ కోసం తమకు చాలా ఫోన్లు వస్తున్నాయని హైకోర్టు వెల్లడించింది. 'ఆక్సిజన్ కొరత లేదనడాన్ని మేము అంగీకరించం. మా సన్నిహితులకు కూడా ఆస్పత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్ దొరకట్లేదు. ఇవన్నీ మీకు తెలుసు. హర్యానాలో జనం చనిపోతున్న సంగతి మీకు తెలుసు.మీరట్‌లోనూ,ఢిల్లీలోనూ జనం చనిపోతున్నారని మీకు తెలుసు.' అని గురువారం(ఏప్రిల్ 29) హైకోర్టు వ్యాఖ్యానించింది.
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వ ఆరోపణలు,విమర్శలు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తప్పు పట్టారు. ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ ఇప్పటి అవసరాలకు సరిపోతుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం అనవసరంగా విషయాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు.

English summary
Shruti Saha had spent hours searching for somewhere in New Delhi to refill an oxygen canister when she heard that her frantic efforts had been in vain: her mother had died of COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X