కరోనాను జయించటంలో మహిళలే శక్తివంతులట...ఆసక్తికర అధ్యయనం
కరోనావైరస్ మహమ్మారి జయించడంలో పురుషులతో పోల్చుకుంటే మహిళల్లోనే అధికంగా శక్తి ఉందని తేల్చింది ఒక సర్వే. మహిళలలో వ్యాధి నిరోధక శక్తి పురుషుల కంటే ఎక్కువగా ఉండటంతో వారు కరోనాను ఈజీగా జయించగలుగుతున్నారని తాజా పరిశోధనలో రుజువైంది .ప్రపంచమే కరోనాతో పోరాడుతున్న సమయంలో కరోనాకు సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి .

మహిళల్లో కరోనాను జయించే వ్యాధినిరోధక శక్తి ఎక్కువ
సహజంగా పురుషులు శక్తివంతులైనప్పటికీ మహిళలు, పురుషుల కంటే ఎక్కువగా వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉంటారు. అందుకే సహజ మరణాల్లో చూసినా పురుషుల సంఖ్య అధికంగా ఉంటుంది.
ఇక ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఎవరిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంది అన్న అంశంపై జరిపిన పరిశోధనల్లో మహిళల్లోనే కరోనాను జయించే వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉందని రుజువైంది .కరోనా నుండి మహిళలు ఈజీగా కోలుకుంటున్నారని అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన నేచర్ జర్నల్ చెబుతోంది.

కరోనాను ఎదుర్కొనే టీ సెల్స్ ప్రభావవంతంగా పని చేసేది మహిళలలోనే
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి టీ సెల్స్ ఎంతగానో దోహదం చేస్తాయి. అటువంటి టీ సెల్స్ ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా ఉంటున్నాయని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మహిళల తో పోల్చుకుంటే పురుషుల్లో ఈ టీ సెల్స్ ఎక్కువ ప్రభావవంతంగా పని చేయడం లేదని రుజువైంది.
98 మంది కరోనా బాధితులను పరీక్షించి పరిశోధించిన క్రమంలో ఈ విషయాన్ని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. రోగనిరోధక శక్తిని పెంచి, పోరాడే బలం చేకూర్చే సైటోకైన్స్ వ్యవస్థ కూడా మహిళలలో చాలా గొప్పగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

ఇండియాలో కూడా పురుషులే అధికంగా మృతి చెందారని డేటా
ఇదిలా ఉంటే భారతదేశంలో మరణాల రేటు క్రమంగా తగ్గుతుందని, ప్రజలు కోలుకుంటున్న సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది . ఇక ఇటీవల ఇచ్చిన డేటా ప్రకారం కోవిడ్ -19 మరణాలలో 69% పురుషులు మరియు 31% స్త్రీలు ఉన్నారని తెలిపింది.దీనిని బట్టి కరోనా బారిన పడి మృతి చెందుతున్న వారిలో అధిక శాతం పురుషులే అన్నది అర్ధం అవుతుంది. అంతే కరోనాతో పోరాడే శక్తి మహిళల్లో ఎక్కువగా ఉండటం వల్లే వారి మరణాల శాతం తక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక పురుషుల్లోనే అధిక భాగం మృతి చెందినట్లుగా గణాంకాలను బట్టి స్త్రీల కంటే పురుషులకే కరోనాతో రిస్క్ ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది.
Recommended Video

కరోనా బారిన పడే ప్రతిముగ్గురిలో ఒక మహిళ .. అయినా జయించటంలో వారే శక్తివంతులు
కరోనా బారిన పడుతున్న వారిలో దాదాపు ప్రతి ముగ్గురిలో ఒక మహిళ ఉంటున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ మహిళల డెత్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందుకు కారణం . దేనినైనా తట్టుకునే శక్తి మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. వారిలో వ్యాధి నిరోధక వ్యవస్థ పురుషులతో పోల్చుకుంటే బలంగా ఉంటుంది. కరోనా బారిన పది మృతి చెందుతున్న మహిళల్లో ముఖ్యంగా అనీమియాతో బాధ పడుతున్నవారు, ఇతరత్రా ఆనారోగ్య సమస్యలతో బాధ పడేవారే ఎక్కువ. అలాంటి వారికే హైరిస్క్ ఉంటుంది . ఏది ఏమైనా కరోనాను జయించటం పురుషుల కంటే మహిళలకే సాధ్యం అవుతుంది అని అధ్యయనాలు చెప్తున్నాయి .
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications