శబరిమల గుడిలోకి మహిళలు: సుప్రీం కోర్టులో అయ్యప్ప భక్తుల రివ్యూ పిటిషన్
Recommended Video

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం నాడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను నేషనల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్ (జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం) దాఖలు చేసింది.
కాగా, ఈ తీర్పుపై శబరిమల ఆలయ ప్రధాన పూజారి, ఇతర పూజారులు, భక్తులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది సరికాదని చెబుతున్నారు. అంతకుముందు, ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి పూజారులతో మాట్లాడేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధపడింది.

ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. పూజారులను చర్చలకు పిలిచారు. కానీ వారు ఆయనకు గట్టి షాకిచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల పైన మాట్లాడేందుకు తాము ముఖ్యమంత్రిని కలుసుకోవాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పుపై మొదట రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ఆ తర్వాతే ముఖ్యమంత్రితో మాట్లాడుతామని ప్రధాన పూజారి మోహనారు కందారౌ అన్నారు.
ప్రభుత్వం ఈ విషయంలో ఏదీ తేల్చనంత వరకు తాము మద్దతివ్వమని, అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తే అందులో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, రుతుక్రమం వచ్చే స్త్రీలు కూడా రావొచ్చునని, అలాంటి వాళ్లను అనుమతించడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, సన్నిధి ఆచారాలు దెబ్బతింటాయని, ఇక శబరిమలలో 600 మంది మహిళా పోలీసులను నియమిస్తామని ప్రకటించారని, ఇవన్నీ ఆలయ సంస్కృతికి భిన్నంగానే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications