ఢిల్లీలో మహిళపై ఐదుగురు సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ: ఆటోలో వెళ్తున్న యువతిని కారులో కిడ్నాప్ చేసి ఐదుగురు గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 25 సంవత్సరాల యువతి అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం 25 సంవత్సరాల యువతి పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ నగర్ నుండి దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి ఆటోలో బయలుదేరింది. అదే సమయంలో నలుగురు యువకులు శాంట్రో కారులో వచ్చి ఆటోను అడ్డగించారు.
అనంతరం యువతిని బలవంతంగా కారులోకి లాక్కున్నారు. ఆటో డ్రైవర్ అడ్డు పడినా వారు యువతిని బలవంతంగా తీసుకు వెళ్లారు. మార్గం మధ్యలో మరో వ్యక్తి కారులోకి ఎక్కాడు. కారును దక్షిణ ఢిల్లీలోని దక్షిణపురికి తీసుకు వెళ్లారు.

అదే సమయంలో ఐదుగురు కామాంధులు యువతి మీద సామూహిక అత్యాచారం చేశారు. తరువాత యువతిని డిఫెన్స్ కాలనీలో వదిలి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతి, ఆటో డ్రైవర్ ఇచ్చిన ఆదారాలతో ఐదుగురు కామాంధులను అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. అత్యాచారం చెయ్యడనానికి ఉపయోగించిన శాంట్రో కారు స్వాదీనం చేసుకున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications