వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌కు స్త్రీల నిరసన: పారిపోయాడని వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

అమేథీ: అమ్ అద్మీ పార్టీ అధినేత, డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నల్లజెండాలు ఎదురయ్యాయి. ఆదివారం అమేథీలో ఆయన ప్రచారానికి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లాలని వారు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మహిళలు బ్యానర్లు ప్రదర్శించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

అమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆప్ తరఫున కుమార్ విశ్వాస్ బరిలో ఉన్నారు. అతనికి మద్దతుగా కేజ్రీవాల్ మంగళవారం రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు నల్లజెండాలు ఎదురయ్యాయి. కేజ్రీవాల్‌ను భగోడాగా అభివర్ణిస్తూ పారిపోయాడంటూ వ్యాఖ్యానించారు.

Women shout slogans against Kejriwal n Amethi

కేజ్రీవాల్‌పై తమకు కోసంగా ఉందని, ఎందుకంటే ఢిల్లీలో ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిగా చేస్తే, ఆ పదవికి రాజీనామాచేసి కేజ్రీవాల్ జనాన్ని మోసం చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఇప్పుడు ఆయన ఇక్కడకు వచ్చి అవినీతిపై పోరాటం చేస్తామని అంటున్నారని వారు మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీపై మహిళలు ఫిర్యాదు కూడా చేశఆరు.

కాంగ్రెస్, బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలతో జనం విసిగిపోయారని ఆయన ధ్వజమెత్తారు. రాహుల్‌పై బిజెపి కావాలనే బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అమేథీలో బిజెపి తరఫున నటి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌కు అమేథీలో కూా ఓటమి భయం పట్టుకుందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. పదేళ్ళలో నియోజకవర్గం మొహం చూడని సోనియాగాంధీ ఇప్పుడు కొడుకు కోసం ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

English summary
It was yet another black day for Arvind Kejriwal in Uttar Pradesh. A group of women heckled the Aam Aadmi Party (AAP) convener during a road show on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X