వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ సంతోష సూచీల్లో భారత్‌139/149- ఉపఖండంలో లాస్ట్‌- ఫిన్లాండ్ టాప్‌

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏటా నెలకొన్న పరిస్ధితులు, ప్రజలకు అందుతున్న సేవలు, వారి సంతృప్త స్ధాయిల ఆధారంగా ఐక్యరాజ్యసమితి హ్యాపీనెస్ ఇండెక్స్ ( సంతోష సూచీ) ర్యాంకులు విడుదల చేస్తుంటుంది. ఇందులో భారత్ పరిస్ధితి మరీ దయనీయంగా మారింది. మొత్తం 149 దేశాల్లో పరిస్ధితుల ఆధారంగా ఈ హ్యాపీనెస్‌ ఇండెక్స్ రూపొందిస్తే భారత్‌కు దక్కిన స్ధానం 139 అంటే చివరి నుంచి 11వ స్ధానం. ఈ జాబితాలో భారత ఉపఖండంలో ఆప్ఘనిస్తాన్‌ మినహా అన్ని దేశాలు మన దేశం కంటే మెరుగ్గా ఉన్నాయి. చైనా అయితే టాప్‌ 100లో స్ధానం దక్కించుకుంది.

వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ ర్యాంకుల ప్రకటన

వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ ర్యాంకుల ప్రకటన

ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ ఏటా వివిధ దేశాల్లో పరిస్ధితుల ఆధారంగా ప్రజల సంతృప్త స్ధాయిల్ని లెక్కిస్తూ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ విడుదల చేస్తుంటుంది. ఇందులో పలు దేశాలు తమ దేశాల్లో పరిస్ధితుల ఆధారంగా వివిధ ర్యాంకుల్లో నిలుస్తుంటాయి. గ్యాలప్‌ పోల్‌ విధానంలో జరిగే ఈ సర్వేలో వివిధ దేశాలు సాధించి ర్యాంకుల్ని ప్రకటించేందుకు ఆయా చోట్ల ప్రజల జీవన మూల్యాంకనాలు, సానుకూల భావోద్వేగాలు, ప్రతికూల భావోద్వేగాల్ని ఐరాస పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సూచీలో వరుసగా నాలుగో ఏడాది ఫిన్లాండ్‌ టాప్‌ పొజిషన్‌ సాధించింది.

 హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో భారత్‌కు 139 స్ధానం

హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో భారత్‌కు 139 స్ధానం

మొత్తం 149 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్‌ 139వ స్ధానంలో నిలిచింది. టాప్‌ పొజిషన్‌లో ఫిన్లాండ్‌ మరోసారి ఎంపిక కాగా.. ఉపఖండమైన దేశమైన ఆఫ్ఘనిస్తాన్ చివరి స్ధానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ తర్వాతి స్ధానాల్లో్ బురుండి, యెమెన్‌, టాంజానియా, మలావీ, లెసోతో, బోట్స్‌వానా, రవాండా, జింబాబ్వే ఉన్నాయి. ఈ సర్వే సందర్భంగా పలు అంశాల్లో 0 నుంచి 10 పాయింట్లు ఇచ్చి అందులో సంతోషదాయకమైన జీవన విధానం కలిగి ఉంటే ర్యాంకింగ్ ఇవ్వాలని కోరతారు. ప్రజలు ఇచ్చే రేటింగ్‌ ఆధారంగా ఆయా దేశాల్లో పరిస్ధితుల్ని అంచనా వేస్తారు.

ఉపఖండంలో దేశాలన్నీ భారత్‌ కంటే మెరుగే

ఉపఖండంలో దేశాలన్నీ భారత్‌ కంటే మెరుగే


ఐక్యరాజ్యసమితి తాజా హ్యాపీనెస్ ఇండెక్స్‌లో భారత ఉపఖండంలోని దేశాల్లో ఆప్ఘనిస్తాన్‌ మినహా మిగిలిన దేశాలన్నీ భారత్‌ కంటే టాప్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా చైనా 84వ స్ధానంలో ఉండగా, పాకిస్తాన్‌ 105వ స్ధానంలో, శ్రీలంక 129వ స్ధానంలో, బంగ్లాదేశ్‌ 101వ స్ధానంలో నిలిచాయి. అంటే భారత్‌ కంటే ఆయా దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు ఈ సూచీలో తేలింది. ఇప్పటికే తీవ్రవాదంతో సతమతం అవుతున్న పాకిస్తాన్‌ వంటి దేశాలతో పోల్చినా భారత్‌ అట్టగుడుగున ఉండటం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో తాజా ర్యాంకులు ఆందోళన కలిగిస్తున్నాయి.

 హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రామాణికాలు ఇవే

హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రామాణికాలు ఇవే

ఐక్యరాజ్యసమితి హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో పలు ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటిస్తుంటుంది. ఇందులో పాజిటివ్‌ ఎమోషన్స్‌ విభాగంలో సంతోషం, నవ్వు, ఆనందంగా గడపడం వంటి అంశాల్ని బట్టి ర్యాంకులు ఇస్తారు. అలాగే ఆందోళన, బాధ, కోపం వంటి అంశాల్ని ప్రామాణికంగా తీసుకుంటారు. వీటితో పాటు ఆయా దేశాల్లో తలసరి ఆదాయం, సంతోష దాయిక జీవితంపై అంచనాలు, సామాజిక మద్దతు, జీవన ఎంపికల స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల్ని కూడా పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇస్తారు. దీంతో ఈ ర్యాంకులకు అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది.

English summary
India ranked 139 out of 149 countries in the World Happiness Report 2021, released by the UN Sustainable Development Solutions Network on Friday. Finland was ranked the happiest country in the world, a feat the Nordic nation achieved for the fourth consecutive year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X