వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాముకాటు మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్.. సంవత్సరానికి ఎన్ని మరణాలంటే!!

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో పాముకాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్ వెల్లడించింది. 2000 సంవత్సరం నుండి 2019 సంవత్సరాల వరకూ గత 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాముకాటుతో ప్రాణాలు వదిలారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. అంటే ప్రతి సంవత్సరం సరాసరి పాముకాటుకు 58వేల మంది చనిపోతున్నారని, నివేదిక ఆధారంగా ఈ లెక్కలు వెల్లడించినట్లు గా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇంకా ప్రభుత్వ లెక్కల్లోకి రాని పాముకాటు మరణాలు దేశంలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నట్టు కూడా పేర్కొంది. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో పాముకాటు మరణాలు సంభవిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది.

కేంద్రం లెక్కలకు పాముకాటు మరణాలకు భారీ వ్యత్యాసం .. గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ

కేంద్రం లెక్కలకు పాముకాటు మరణాలకు భారీ వ్యత్యాసం .. గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017 లో 1068 మంది, 2018లో 1060 మంది, 2019లో 885 మంది చనిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం పేరుపొందని కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కేంద్రం లెక్కల్లో పేర్కొంటున్న దానికన్న పాముకాటు మృతుల సంఖ్య 60 రెట్లు అధికంగా ఉంటుందని డబ్ల్యుహెచ్వో నివేదిక వెల్లడించింది. ఒక అంచనా ప్రకారం దేశంలో ఏటా సరాసరి 10 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. అయినప్పటికీ వారికి తగినంత పాము కాటు విరుగుడు మందు దేశంలో తయారీలో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

భారతదేశంలో పాముకాటు ఈ పాముల వల్లే.. మరణాలకు కారణం ఇదే

భారతదేశంలో పాముకాటు ఈ పాముల వల్లే.. మరణాలకు కారణం ఇదే


భారతదేశంలో కట్ల పాము, తాచు పాము, రెండు రకాల రక్తపింజర వల్ల ఎక్కువగా పాముకాటుతో సంభవిస్తున్నాయని, మరణాలకు కూడా ఇదే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుతం పాముకాటుకు విరుగుడు యాంటీ వీనం తయారుచేస్తున్న కంపెనీలు నాలుగే ఉన్నాయని, వాటి తయారీ ప్రక్రియలో కూడా నాణ్యత ఉండడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు భారతదేశంలో అవసరానికి తగ్గట్టుగా మెడిసిన్ ఉత్పత్తి జరగడం లేదని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. ఇక పాముకాటుతో మరణాలకు గురవుతున్న వారు కొందరైతే,మరణాలతో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా బాధితులు అంగవైకల్యానికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

ఆస్పత్రులలో పాముకాటు వైద్యం సరిగా అందక మరణాలు

ఆస్పత్రులలో పాముకాటు వైద్యం సరిగా అందక మరణాలు


పాము కాటు కేసుల్లో 30శాతం పూర్తిస్థాయిలో విషం మనిషి శరీరంలోకి వెళ్తుందని, ప్రపంచ సగటు కంటే ఇది ఎక్కువ అని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం గ్రామాల నుంచి పాముకాటుకు గురైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లే సౌకర్యాలు లేకపోవడం అని పేర్కొంది. పాము కాటుకు గురైన వ్యక్తికి పూర్తి స్థాయిలో వైద్యం అందక, వారి శరీరం అంతా విషం వ్యాపిస్తుందని వెల్లడించింది. ఇక చాలా గ్రామాలలో పాము కాటుకు గురైన వెంటనే పసరు వైద్యం తీసుకుంటున్నారని అదికూడా మరణాలకు కారణం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

80% పాముకాటు జూన్ సెప్టెంబర్ నెలల మధ్యనే

80% పాముకాటు జూన్ సెప్టెంబర్ నెలల మధ్యనే

ఇక 80% పాముకాటు జూన్ సెప్టెంబర్ నెలల మధ్యనే జరుగుతున్నాయని, వానాకాలం కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్తూ ఉండడమే దీనికి కారణం అని పేర్కొంది. ఇక 67% పాముకాటు కాళ్లపైన జరుగుతున్నాయని, 40 శాతం పాముకాటు సాయంత్రం 5:00 నుండి రాత్రి 10:00 మధ్యలోనే చోటుచేసుకుంటున్నాయని, 60 శాతం పాముకాటు ఇంట్లో లేదా ఇంటికి దగ్గరలోనే సంభవిస్తున్నాయని, 8 శాతం పాముకాటు మలవిసర్జనకు వెళ్లినప్పుడు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

పాము కాటు మరణాలలో 90% గ్రామాల్లోనే

పాము కాటు మరణాలలో 90% గ్రామాల్లోనే

10 శాతం పాముకాటు నిద్రపోయే సమయంలో జరుగుతున్నాయని, 14 శాతం పాము కాటు కేసుల్లో పాము కరిచిన జాడలు కనిపించడం లేదని, 10 నుండి 19 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా పాము కాట్లకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇక పాము కాటు మరణాలలో 90% గ్రామాల్లోనే సంభవిస్తున్నాయని, 77 శాతం మరణాలు ఆసుపత్రి బయటే జరుగుతున్నాయని, దేశంలో సంభవించే మరణాలలో 0.5 శాతం పాముకాటు తోనే జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

English summary
The World Health Organization has given a shocking report on snakebite deaths, stated that 12 lakh people have lost their lives due to snake bites in India in the last 20 years. An average of 58,000 people die from snakebite every year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X