బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచంలోనే అతిపెద్ద COVID-19 చికిత్సా కేంద్రం, బెంగళూరు గ్రేట్, 10, 100 పడకలు, మెనూ అదుర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రతిరోజు 24 గంటలు ఇప్పుడు కరోనా వైరస్ వ్యాధిని ఎలా అరికట్టాలి ? ఆ మహమ్మారి విరుగుడుకు మందు ఎలా కనిపెట్టాలి ? అనే ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. భారతదేశ ఐటీ, బీటీ దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో ప్రపంచంలోని అతిపెద్ద COVID-19 అత్యాధునిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరు- తుమకూరు (ముంబై) జాతీయ రహదారిలోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా కేంద్రంలో 10, 100 పడకల కరోనా వైరస్ ఐసోలేషన్ కేంద్రం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు 24 గంటలు కొన్ని వేల మంది వైద్య సిబ్బంది ఇక్కడ కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులకు చికిత్స చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. ఈ కోవిడ్-19 చికిత్సా కేంద్రంలోని అనుమానిత రోగుల మెనూ కూడా ప్రభుత్వం ఇచ్చింది.

Blackmail: శశికళ ఆత్మహత్య, ఐదేళ్లుగా నగ్న వీడియోలతో పొలిటికల్ లీడర్ టార్చర్, పెళ్లి కొడుకు !Blackmail: శశికళ ఆత్మహత్య, ఐదేళ్లుగా నగ్న వీడియోలతో పొలిటికల్ లీడర్ టార్చర్, పెళ్లి కొడుకు !

 ఢిల్లీకి బెంగళూరు పోటీ

ఢిల్లీకి బెంగళూరు పోటీ

కరోనా వైరస్ మహమ్మారి భారతీయులను గజగజ లాడిస్తోంది. ఇటీవ దేశ రాజధాని ఢిల్లీలోని చట్టర్ పుర్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాంతంలో దేశంలోని అతిపెద్ద కోవిడ్ -19 చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఢిల్లీలోని కోవిడ్-19 చికిత్సా కేంద్రం కంటే పెద్దది, ప్రపంచంలోనే బెంగళూరు నగర సమీపంలోని నెలమంగల ప్రాంతంలోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా కేంద్రం (BIEC)లో 10, 100 పడకల కోవిడ్-19 చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు తెలిపారు.

 6, 100 పడకలు రెఢీ

6, 100 పడకలు రెఢీ

బెంగళూరు శివార్లలోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ -19 చికిత్సా కేంద్రంలో 10 ,100 మందికి ఒకేసారి చికిత్స చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.. అయితే ప్రస్తుతం 6, 100 మందికి చికిత్స చెయ్యడానికి పడకలతో పాటు వైద్య సిబ్బంది సిద్దంగా ఉన్నారు. మొత్తం ఐదు హాల్స్ గా విభజించారు. హాల్-1 లో 920 పడకలు, హాల్- 2లో 872 పడకలు, హాల్-3లో 1180 పడకలు, హాల్-4లో 1, 512 పడకలు, హాల్-5 లో 1, 616 బెడ్ లు ఏర్పాటు చేస్తున్నారు.

 డాక్టర్లు, నర్సులు, మార్షల్స్

డాక్టర్లు, నర్సులు, మార్షల్స్

బెంగళూరు శివార్లలోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా కేంద్రంలోని ఏర్పాటు చేస్తున్న కోవిడ్-19 చికిత్సా కేంద్రంలో 10, 100 మంది కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులకు చికిత్స చెయ్యడానికి వైద్య సిబ్బందితో సహ మొత్తం 2, 100 మంది సిద్దంగా ఉన్నారు. 300 మంది డాక్టర్లు, 500 మంది నర్సులు, 300 మంది సహాయకులు, 400 మంది పారిశుద్ద కార్మికులు, 300 మంది మార్షల్స్ ఈ కోవిడ్-19 చికిత్సా కేంద్రంలో విధులు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నారని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

 కరోనా వ్యాధి అనుమానితుల మెనూ

కరోనా వ్యాధి అనుమానితుల మెనూ

*. ఉదయం 8 గంటలకు: ఇడ్లీ, పొంగల్, దోసె, చౌచౌబాత్

*. ఉదయం 10 గంటలకు: పండ్లు, సూప్

*. మద్యాహ్నం 12 గంటలకు: చపాతి, రోట్టెలు, పలావ్, సబ్బి, అన్నం, సాంబార్, మజ్జిగ

*. సాయంత్రం 5 గంటలకు: అరటి పండ్లు, చిరుతిండి, బిస్కెట్లు, డ్రైఫ్రూట్స్

*. రాత్రి 7 గంటలకు: చపాతి, రోట్టెలు, పలావ్, సబ్బి, అన్నం, సాంబార్, మజ్జిగ

* రాత్రి నిద్రపోయే ముందు ప్రతిఒక్కరికీ పసుపు మిశ్రమంతో వేడి చేసిన పాలు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

 టైంపాస్ చెయ్యండి

టైంపాస్ చెయ్యండి

అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా కేంద్రంలోని కోవిడ్-19 చికిత్సా కేంద్రంలో కరోనా వ్యాధి సోకిన అనుమానితులు టైం పాస్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ప్రతి హాల్ లో పెద్దపెద్ద స్క్రీన్స్ లు ఉన్న టీవీలు, యోగా, ప్రార్థనలు, చెస్, క్యారమ్స్, పుస్తకాలు, దిన పత్రికలు, మాస పత్రికలు అందుబాటులో ఉంటాయని, ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంటుందని, ప్రముఖ వైద్యులు వ్యాధి ఎలా నయం చేసుకోవాలి అనే విషయంపై ప్రత్యేకంగా ప్రసంగాలు ఇస్తారని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

 వైద్య సిబ్బంది సేఫ్ గా ఉండాలని !

వైద్య సిబ్బంది సేఫ్ గా ఉండాలని !

కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులకు చికిత్స చేసే వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికులు, మార్షల్స్ ఆరోగ్యం కాపాడటానికి అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా కేంద్రంలోని కోవిడ్-19 చికిత్సా కేంద్రంలో ఐసీయూ, ఇసీజీ, ఆక్సిజన్ సపోర్ట్, ప్రథమ చికిత్స, ఫార్మసి తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.

Recommended Video

KCR, KTR ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా..? || Oneindia Telugu
 కంట్రోల్ రూం......అదే మాలక్షం !

కంట్రోల్ రూం......అదే మాలక్షం !

వీటికి తోడు అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఈ కోవిడ్-19 చికిత్సా కేంద్రం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నామని, కర్ణాటకలో కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించడం తాము లక్షంగా పెట్టుకున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు అంటున్నారు.

English summary
Coronavirus: World largest COVID- 19 centre (CCC) with 10,100 beds at Bengaluru International Exhibition Centre (BIEC) is a significant step in this direction. what is specialty of this?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X