కారణమిదే: జెకెఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ అరెస్ట్
శ్రీనగర్: జెకెఎల్‌ఎఫ్ నాయకుడు యాసిన్ మాలిక్‌ను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. హురియత్ నేత మిర్వాజ్ ఉమర్ ఫరూక్‌ను గృహ నిర్భంధంలో ఉంచారు.
శుక్రవారం నాడు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం వద్ద హురియత్, జెకెఎల్ఎఫ్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి అరెస్ట్ ప్రాధాన్యతను సంతరించుకొంది.

యాసిన్ మాలిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11వ, తేది వరకు మాలిక్‌ను సెంట్రల్ జైల్లో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. హురియత్ చీఫ్ సయ్యద్ అలీషా గిలానీ కొన్నేళ్ళుగా గృహ నిర్భంధంలో ఉన్నారు.
మాలిక్, గిలానీ, మిర్వాజ్‌లు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఎన్ఐఏ అధికారులు వేధిస్తున్నారని, ఈ వేధింపులకు నిరసనగానే ఈ ధర్నాలకు పిలుపునిచ్చారు.
కాశ్మీర్‌లో ఇటీవల కాలంలో వేర్పాటువాదులకు మనీలాండరింగ్ ద్వారా నిధులు సరఫరా అవుతున్నాయనే సమాచారంపై ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications