ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వెళ్ళిన వైసీపీ నేత, కమెడియన్ అలీ .. ఎందుకో తెలుసా ?
టాలీవుడ్ నటుడు, కమెడియన్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు వెళ్ళటంపై చర్చ జరుగుతుంది. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వెళ్లడంతో ఈ విషయం రాజకీయ వర్గాలో చర్చనీయాంశం అయ్యింది. అలీ బీజేపీలో చేరుతున్నట్టు , పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అయితే అదంతా వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు కమెడియన్ అలీ. ఇక ఆయన ఢిల్లీ బీజేపీ ఆఫీస్ కు వెళ్ళిన కారణం కూడా చెప్పారు .
ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ కోసమే ఢిల్లీకి వెళ్లానని అలీ వెల్లడించారు.ఇక ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలో ఇండియాకు వస్తున్నారని,ఆయన ప్రధాని మోడీని కలవాలని భావిస్తున్నారని, ఆయన కోసమే ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకోవాలని ఢిల్లీకి వచ్చినట్లు ఆలీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ గురించి చర్చించానని చెప్పిన అలీ అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

దీంతో అలీ పార్టీ మారతారేమో అనే ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఎన్నికలకు ముందు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ప్రచారం కూడా చేసిన అలీ, పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవిలో కనిపిస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. వైసీపీలో అలీకి ఏ పదవి దక్కలేదు .
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications