Aunty love story: ఆంటీ పక్కనే ఉద్యోగం, దైవదర్శనం, బీచ్ లో పాటతో పైలోకాలకు, పోతేపోని !
చెన్నై/ శివకాశి/ విరూద్ నగర్: ఆంటీ. అంకుల్ విరహంతో చాలా కాలం ఎంజాయ్ చేశారు. ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను అర్థం చేసుకోరు అంటూ సినిమా డైలాగులు చెప్పారు. చస్తేచావండి అంటూ ఇరు కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. వివాహేతర సంబంధంతో కుటుంబ సభ్యులు మందలించారని ఆవేదనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జంట మొదట దైవ దర్శనం చేసుకుని తరువాత ఆంటీ, అంకుల్ బీచ్ లో సంచరించి అక్కడే విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర జంట ఫ్యామిలీలలను గాలికి వదిలేసి ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అక్రమ సంబంధం వలన తాము మందలించామని, అందుకే వారు ఆత్మహత్య చేసుకున్నారని, పోతేపోని వదిలేయండి అంటూ ఇరు కుటుంబ సభ్యులు అన్నారు.

హ్యాపీగా రెండు కాపురాలు
తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లా శివకాశి అమ్మన్ కోయిల్ పట్టిలో గణేశ్ ముత్తు రాజ్ అలియాస్ ముత్తు (45), విజయరాణి (42) దంపతులు నివాసం ఉంటున్నారు. గణేశ్ ముత్తు, విజయరాణి దంపతులకు 17 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శివకాశి సమీపంలోని సామిపురంలో లక్ష్మణన్ (47), జయలక్ష్మి అలియాస్ జయా (45) దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మణన్, జయలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఒకేచోట ఆంటీ, అంకుల్ ఉద్యోగాలు
గణేశ్ ముత్తు, జయలక్ష్మి ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఒకే చోట ఉద్యోగం చెయ్యడంతో గణేశ్ ముత్తు, జయలక్ష్మిల మధ్య పరిచయం అయ్యింది. జయా ఆంటీని చూసి గణేశ్ సోల్లు కార్చుకుని ఆమెకు మరింత దగ్గర అయ్యాడు. గణేశ్ ముత్తు, జయలక్ష్మిల పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. గణేశ్ ముత్తు, జయలక్ష్మి ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోయారు.

లవ్ స్టోరీతో కుటుంబ సభ్యులు షాక్
గణేశ్ ముత్తు ఇంటికి రాకుండా జయలక్ష్మితో జల్సాలు చేస్తున్న విషయం అతని భార్య విజయరాణికి తెలిసింది. తన భర్త గణేశ్ ముత్తు సక్రమంగా ఇంటికి రావడం లేదని, జయలక్ష్మితో జల్సాలు చేస్తున్నాడని బావ రామర్ కు (గణేశ్ ముత్తు సోదరుడు) చెప్పింది. తమ్ముడు గణేశ్ ముత్తును పిలిచి జయలక్ష్మితో దూరంగా ఉండాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అన్న రామర్ హెచ్చరించాడు. తన భార్య జయలక్ష్మి అక్రమ సంబంధం సాగిస్తుందని తెలుసుకున్న లక్ష్మణన్ సైతం భార్యకు బుద్దిగా ఉండాలని హెచ్చరించాడు.

తోలు తీసేస్తాం జాగ్రత్త
ఈ వయసులో తిక్క చేష్టలు చేస్తే మీకు తోలు తీసేస్తామని గణేశ్, జయా ఆంటీకి వారి కుటుంబ సభ్యులు అనేకసార్లు హెచ్చరించారు. కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో గణేశ్ ముత్తు, జయలక్ష్మి కలత చెందారు. కుటుంబ సభ్యులకు దూరంగా మనం ఉండలేమని, అలాగని విడిపోయి జీవించలేమని గణేశ్ ముత్తు, జయలక్ష్మి నిర్ణయించారు. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరికి ఏ సమస్య ఉండదని గణేశ్ ముత్తు, జయలక్ష్మి నిర్ణయించారు.

బీచ్ లో చివరి ప్రయాణం
ప్రేమ జంట గణేశ్ ముత్తు, జయలక్ష్మి ఇళ్లు వదిలి తిరుచెందూరు చేరుకున్నారు. తిరుచెందూరులోని మురుగన్ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దైవ దర్శనం చేసుకున్న గణేశ్ ముత్తు, జయలక్ష్మి నేరుగా నాళికినరు ప్రాంతంలోని సముద్ర తీరంలోని బీచ్ చేరుకున్నారు. బీచ్ లో ఉల్లాసంగా తిరిగిన గణేశ్ ముత్తు, జయలక్ష్మి అక్కడే ఇద్దరు కలిసి విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.

చస్తే చావనీ వదిలేయండి
మరుసటి రోజు గణేశ్, జయా అంటీల శవాలు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గణేశ్ ముత్తు జోబులో ఉన్న కొన్ని కాగితాల ఆధారంగా ఇద్దరి అడ్రస్ లు సేకరించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కనిపెంచిన పిల్లలను గాలికి వదిలేసి వ్యామోహంతో ఆత్మహత్యలు చేసుకున్న గణేశ్, జయాల గురించి వారి కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications