Year Ender 2021: కరోనాతో ముగుస్తున్న ఏడాది-ఆరంభంలో సెకండ్ వేవ్-ఇప్పుడు ఓమిక్రాన్
ఈ ఏడాది భారత్ కు కరోనా వైరస్ తో పోరాటంతోనే సరిపోయింది. ఆరంభంలో కోవిడ్ 19 సెకండ్ వేవ్ భయాలతో ఏడాది మొదలుపెట్టిన భారతీయలు.. ఏడాది ముగిసే సమయానికి ఓమిక్రాన్ భయాలతో అల్లాడుతున్నారు. ఈ మధ్యలో లక్షల సంఖ్యలో పుట్టుకొచ్చిన కేసులు, వేలలో సంభవించిన మరణాలు దేశాన్ని అతకాకుతలం చేశాయి. భారీ స్ధాయిలో ఉద్యోగాలకు ఎసరుపెట్టాయి. కోట్ల మంది ఉపాధి దెబ్బతీశాయి. ఆర్ధిక వ్యవస్ధల పరిస్ధితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. దీంతో ఈ ఏడాది మరో కోవిడ్ సంవత్సరంగా మిగిలిపోయింది.

కోవిడ్ సెకండ్ వేవ్
భారత్ లో కోవిడ్ 19 తొలివేవ్ గతేడాది ప్రభావం చూపగా.. ఈ ఏడాది మార్చి తర్వాత సెకండ్ వేవ్ కేసులు నమోదు కావడం ప్రారంభమైంది. అప్పటికే తొలివేవ్ కారణంగా లక్షల మందిపై ప్రభావం పడటంతో సెకండ్ వేవ్ సమయంలో జనం కాస్త అప్రమత్తమయ్యారు. అయినా వేగంగా చుట్టుముట్టిన వైరస్ తో ఉక్కిరిబిక్కిరి కాక తప్పలేదు. ఆస్పత్రులు కరోనా కేసులతో నిండిపోయాయి. తొలి వేవ్ తో పోలిస్తే దారుణంగా విరుచుకపడిన వైరస్ కారణంగా సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు సరిపోలేదు మందులు దొరకలేదు. మందులతో సెకండ్ వేవ్ వేరియంట్ శాంతించలేదు. దీంతో రెమిడెసివిర్, ఇటోలిజుమాబ్ వంటి ఇంజెక్షన్లు సైతం లక్షల రూపాయలతో కొనుగోలు చేయాల్సి వచ్చింది. వైద్యానికి డబ్బుల్లేక వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. ప్రతీ ఇంట్లోనూ ఓ వైరస్ రోగి, లేదా మృతుడు కనిపించిన పరిస్ధితి.

వ్యాక్సిన్లకు పెరిగిన డిమాండ్
సెకండ్ వేవ్ పరిస్ధితులతో వ్యాక్సిన్లకు సైతం డిమాండ్ పెరిగిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పుకున్నా ముందుగా 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత పరిస్ధితి ముదరడంతో 40 ఏళ్లు పైబడిన వారందరికీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ తర్వాత 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇస్తామని ప్రకటించారు. ఇలా అందరికీ వ్యాక్సిన్లు అందబాటులోకి వచ్చే సరికి పుణ్యకాలం పూర్తయింది. సెకండ్ ప్రభావం తగ్గిన తర్వాత ధర్డ్ వేవ్ భయాలతో వ్యాక్సిన్లు వేయించుకోవడం మొదలుపెట్టారు.

ఓమిక్రాన్ తో ధర్డ్ వేవ్ భయాలు
అదే సమయంలో ఓమిక్రాన్ వైరస్ ప్రభావం మొదలైంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వైరస్ వేరియంట్ ఇప్పటికే భారత్ చేరుకుంది ఇప్పటికే 30కి పైగా కేసులు కూడా నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో ఓమిక్రాన్ ప్రభావం కనిపిస్తోంది. ఇది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించే ప్రమాదం కూడా కనిపిస్తోంది. దీంతో ఓమిక్రాన్ భయాలు జనాన్ని కుదిపేస్తున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న క్రమంలో ఓమిక్రాన్ భయాలతో మళ్లీ వ్యాక్సిన్లకు సైతం డిమాండ్ పెరుగుతోంది. అలాగ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకన్న వారు బూస్టర్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్ధితులు ఎక్కడ ధర్డ్ వేవ్ కు దారి తీస్తాయన్న ఆందోళన ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications