Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

year ender 2024: దేశ రాజకీయాలను కుదిపేసిన కీలక ఘటనలు ఇవే!

2025 సంవత్సరం మరికొద్ది రోజుల్లో రాబోతోంది. 2024 సంవత్సరంలో దేశంలో అనేక రాజకీయ ఘటనలు దేశవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తిని కలిగించాయి. ఊహించని ఎన్నో కీలక పరిణామాలు దేశ రాజకీయాలలో చోటుచేసుకున్నాయి. ఇక వాటి విషయానికొస్తే ..2024 సంవత్సరంలో దేశంలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్ 19 నుండి జూన్ 1వ తేదీ మధ్య మొత్తం ఏడు దశల్లో జరిగింది.

మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు
ఈ ఎన్నికలలో 400 సీట్ల లక్ష్యంతో ఎన్డీఏ ఎన్నికల బరిలోకి దిగగా, ప్రతిపక్షాలు ఇండియా కూటమితో బలంగా తలపడ్డాయి. ఎన్డీఏ 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయినప్పటికీ అధికారాన్ని మాత్రం సాధించింది. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఇది దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.

Year ender 2024 These are the key events that shook the country politics

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా, అతిషికి సీఎం అవకాశం
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలుకు వెళ్లారు. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఢిల్లీప్రజలు తనకు క్లీన్ చిట్ ఇస్తేనే సీఎం పదవిని మళ్ళీ స్వీకరిస్తానని అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఇక ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఆయన స్థానంలో అతిషికి అవకాశం వచ్చింది.

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ రాజకీయాలు
2024 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ యూపీలో రాయబరేలి నుండి కేరళలోని వయనాడ్ నుండి పోటీ చేసి రెండుచోట్ల విజయం సాధించారు. దీంతో ఆయన వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకొని రాయబరేలి ఎంపీగా కొనసాగుతున్నారు.2024 సంవత్సరంలో ప్రియాంకగాంధీ రాజకీయాలలో కీలకఅడుగు వేశారు. రాహుల్ గాంధీ వదిలేసిన వయనాడ్ లోక్సభ స్థానం నుంచి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకగాంధీ పోటీ చేసి విజయం సాధించారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపై దేశవ్యాప్త ఆసక్తి
ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చరిత్రను సృష్టించాయి .దాదాపు దశాబ్దకాలం తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 ని తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి కావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి జమ్ము కాశ్మీర్ ఎన్నికలపైన నిలిచింది. ఈ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ విజయాన్ని సాధించింది. ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మహారాష్ట్రలో ఎన్నికలతో మార్పు
2024 సంవత్సరంలో మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికలలో మహారాష్ట్రలో మహాయుతి కూటమికి నిరాశ ఎదురైతే, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలతో దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు.

జార్ఖండ్ రాజకీయాల్లో షాకింగ్ పరిణామాలు
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు 2024 సంవత్సరంలో ఊహించని షాక్ తగిలింది. ఒక కేసులో ఆయన జైలుకు వెళ్లవలసి వచ్చింది. దీంతో చంపై సోరెన్ జార్ఖండ్ సీఎం అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన హేమంత్ సోరెన్ తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జార్ఖండ్ ముక్తి మోర్చానే విజయం సాధించి హేమంత్ సోరెన్ కే పట్టం కట్టింది.

అధికారం కోల్పోయిన నవీన్ పట్నాయక్
ఈ సంవత్సరం ఒడిస్సా రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.. ఒడిస్సా రాజకీయాలలో చరిత్ర సృష్టించిన నవీన్ పట్నాయక్ ఈ సంవత్సరం అధికారాన్ని కోల్పోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఒడిస్సాలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడంతో నవీన్ పట్నాయక్ ఊహించని విధంగా షాక్కు గురయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+