అసలేం జరుగుతోంది?: యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం రేపు ఉన్నట్టా? లేనట్టా?

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలన్న మీమాంసకు గవర్నర్ తెరదించారా?.. అంతా అనుకున్నట్టే బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించారా?.. సమాధానం అవుననే వినిపిస్తోంది.

yedyurappa to take oath on Thursday Confirmed by Suresh Kumar

ఈ మేరకు రాజాజీనగర్ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. రేపు ఉదయం 9.30గం.కు యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ఆయన తెలిపారు. అయితే యడ్యూరప్ప ఒక్కరే రేపు ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. మంత్రుల ప్రమాణ స్వీకారం బలనిరూపణ తర్వాతే ఉంటుందని సమాచారం. ఈ నెల 29లోగా బలనిరూపణకు గవర్నర్ అవకాశం ఇస్తారని తెలుస్తోంది.  

మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్ తగీతో చర్చల అనంతం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అతిపెద్ద పార్టీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలంటూ మంగళవారం రోహ్ తగి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన గవర్నర్ వజుభాయ్ తో చెప్పగా.. ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం.

కాగా, ప్రమాణస్వీకారానికి సంబంధించి గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన రాకముందే బీజేపీ నేత నుంచి ఆ ప్రకటన రావడం గమనార్హం. బీజేపీ నేత సురేశ్ కుమార్ ట్వీట్ నేపథ్యంలో.. ఈ రాత్రికే గవర్నర్ వజుభాయ్ వాలా నుంచి కూడా అధికారిక ప్రకటన ఉండవచ్చునని అంటున్నారు.

కొద్దిసేపటికే పోస్టు తొలగించిన బీజేపీ ఎమ్మెల్యే:

రేపు ఉదయం 9.30గం. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ కుమార్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించారు. ఇదే విషయాన్ని బీజేపీ అధికారిక ట్విట్టర్ లోనూ వెల్లడించిన పార్టీ.. ఆ తర్వాత తొలగించింది. దీంతో రేపు ఉదయం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం ఉంటుందా? లేదా? అన్న దానిపై ఎటూ చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద ర్ణాటకలో అసలేం జరుగుతోందన్న విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP MLA Suresh Kumar confirmed that BS Yedyurappa to take oath on Thursday at 9.30 AM.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X