బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత

బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మంగళవారం నాడు భారీగా పెరిగిన పసిడి రేట్లు నేడు తగ్గుముఖం పట్టాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, మధ్యప్రాచ్య సంఘర్షణ, ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై యుద్ధ ప్రభావం నేపథ్యంలో పెట్టుబడిదారుల అంచనాలు తలకిందులవుతున్నాయి. ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోన్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోత ప్రశ్నార్థకంగా మారడం దీనికి తోడైంది.

నేడు పసిడి రేట్లు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఉగాది పండగ తర్వాత ఒక్కసారిగా పెరిగాయి. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,270 కాగా, 22 క్యారెట్లు రూ. 1,37,740గా నమోదైంది. కిందటి ముగింపు సెషన్ తో పోల్చుకుంటే వీటి రేట్లల్లో పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం 4,718.34 డాలర్లను తాకింది. అంతకుముందు సెషన్ కంటే 2.51 శాతం పెరిగిందిజ వెండి 3.82 శాతం వృద్ధితో ఔన్స్‌కు 73.96 డాలర్లకు చేరుకుంది.

Gold rate Rebound over 2 Percent MCX on value buying dollar strength and US Fed rate cut hopes dim

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ బంగారం 1.9 శాతం పెరిగి రూ. 1,47,702 వద్ద ట్రేడ్ అయింది. మే డెలివరీ వెండి ఫ్యూచర్స్ కిలోగ్రాముకు 2.8 శాతం వృద్ధితో రూ. 2,37,933 వద్దకు చేరింది. మొత్తం మీద అంతర్జాతీయ సానుకూల సెంటిమెంట్ ఉన్నప్పటికీ, స్థానిక మార్కెట్లలో అధిక ధరల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. స్పాట్ మార్కెట్‌లో వెండి కేజీ రూ. 5,000 తగ్గి రూ. 2,55,000 వద్ద ట్రేడ్ అయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,163, 22 క్యారెట్లు - రూ. 13,899, 18 క్యారెట్లు - రూ. 11,584

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,320

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+