పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?
అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు తగ్గట్లేదు. మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. దీని ప్రభావం చమురు కంపెనీల లాభాలపై పడుతోంది. గల్ఫ్ రీజియన్ లో యుద్ధం మొదలైనప్పటి నుండి భారతీయ రిఫైనరీలకు ముడిచమురు కొనుగోలు వ్యయం 95 శాతానికి పెరిగింది. ఇదివరకు బ్యారెల్ ధర 120.56 డాలర్లకు చేరుకోవడంతో ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ లాభాలు భారీగా తగ్గాయి. గత కొన్ని నెలలుగా లాభాలు ఆర్జించిన ఈ కంపెనీలు ఇప్పుడు తమ మార్జిన్లను కోల్పోతున్నాయి.
ఈ పరిణామాలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ విక్రయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచాయి. లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల వరకు పెరిగింది. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై చూపిన ప్రభావమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. సవరించిన ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి.

ఇంధన డీలర్లు తెలిపిన వివరాల ప్రకారం- హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పవర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఎక్స్ పీ 95 (XP95) వంటి బ్రాండెడ్ ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.09 పైసల మేర పెరిగింది. ఇప్పటివరకు లీటరుకు రూ. 111.68 పైసలు ఉన్న ప్రీమియం పెట్రోల్ ధర ఇప్పుడు దాదాపు రూ. 113.77 పైసలకు చేరింది. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పూ లేకపోవడం వాహనదారులకు కొంత ఊరట.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఈ పెంపుదలపై ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, మార్కెట్ ధరల ప్రకారం స్పీడ్ పెట్రోల్ (BS-VI) ధర రూ. 2.09 పైసలు పెరిగి లీటరుకు రూ. 112.92 పైసలకు చేరింది. సాధారణ పెట్రోల్ (MS BS-VI) ధర రూ. 103.81 పైసలు,, డీజిల్ (HSD BS-VI) ధర రూ. 90.35 పైసల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. గల్ఫ్ రీజియన్ లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఇంధన సరఫరా డైనమిక్స్, అంతర్జాతీయ ముడిచమురు పోకడలను ప్రభావితం చేయడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణం.
-
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications