వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏను సమర్థిస్తారా? అయితే 8866288662కు మిస్డ్‌కాల్ ఇవ్వాలన్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

వ్యతిరేక నిరసనల జోరు తగ్గిన వేళ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై కేంద్రం ఫోకస్ ను మరింత పెంచింది. చట్టాన్ని అమలు కానివ్వబోమంటూ నాన్ బీజేపీ ముఖ్యమత్రులు ప్రకటనలు చేయడంతో.. ఏకంగా రాష్ట్రాలనే బైపాస్ చేస్తూ సీఏఏను ఆన్ లైన్ విధానంలో చేపట్టాలని కేంద్రం భావిస్తున్నది. మరోవైపు సీఏఏపై ప్రజల్లో నెలకొన్ని అనుమానాల్ని తీర్చేందుకు, మద్దతు కూడగట్టేందుకు బీజేపీ తనవంతు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.

సీఏఏను మహారాష్ట్రలో అమలు చేసేదే లేదు: సీఎం ఉద్ధవ్, మంత్రి బాలా సాహెబ్సీఏఏను మహారాష్ట్రలో అమలు చేసేదే లేదు: సీఎం ఉద్ధవ్, మంత్రి బాలా సాహెబ్

 ఇండియా విత్ సీఏఏ

ఇండియా విత్ సీఏఏ

సీఏఏ అనేది శరణార్థులకు పౌరసత్వమిచ్చే ప్రక్రియేగానీ భారతీయుల పౌరసత్వాన్ని లాగేసుకునేది కాదు'అని పదే పదే ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీ.. గతవారం ‘ఇండియా విత్ సీఏఏ' ప్రచారాన్ని ప్రారంభించారు. సీఏఏ వ్యతిరేక నిరసలు జరిగిన సమయంలోనూ సీఏఏ అనుకూల ర్యాలీలు జరగడం, సమాజంలోని పలు వర్గాలు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించడం తెలిసిందే.

మద్దతును పెంచుకునేందుకు..

మద్దతును పెంచుకునేందుకు..

కేంద్రం రూపొందించిన సీఏఏపై అనుమానాల్ని నివృత్తి చేస్తూనే మద్దతుదారుల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాంగా 8866288662 అనే టోల్ ఫ్రీ నంబర్ ను పార్టీ జాతీయ నాయకత్వం విడుదల చేసింది. ‘‘సీఏఏను సమర్థించేవాళ్లు ఈ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కేంద్రానికి తమ మద్దతు తెలియజేయొచ్చు''అని బీజేపీ జాతీయ నేత అనిల్ జైన్ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ నెల 15 వరకు స్పెషల్ డ్రైవ్..

ఈ నెల 15 వరకు స్పెషల్ డ్రైవ్..


సీఏఏపై ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల్ని ప్రచారం చెయ్యడం వల్లే మైనార్టీలు ఆందోళనలకు గురై, రోడ్లపైకి వచ్చారని బీజేపీ ఆరోపిస్తున్నది. మైనార్టీలతోపాటు మిగతా వర్గాల్లోనూ సీఏఏపై అవగాహన పెంచేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ఈనెల 15 వరకు కొనసాగనుంది. పార్టీలోని కీలక నేతలు.. పలు సిటీలు, పట్టణాల్లో మీటింగ్ లు ఏర్పాటుచేసి సీఏఏపై వాస్తవాల్ని ప్రజలకు వివరించడం, ఆయా ప్రాంతాల్లోని ప్రముఖుల ఇండ్లకు వెళ్లి మద్దతు అడగటం తదితర కార్యక్రమాల్ని స్పెషల్ డ్రైవ్ లో చేపట్టారు.

English summary
The BJP announces a toll-free number 8866288662 where citizens can give missed calls to register their endorsement of the CAA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X