రాముడు, హనుమంతుడు దేవుళ్లు, దేవుడితో పెట్టుకుంటే ?, కాంగ్రెస్ కు మోదీ వార్నింగ్ !

బెంగళూరు/విజయనగర: కర్ణాటకలో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న రాముడిని లాగేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి హనుంమతుడిని కూడా (భజరంగ్ దళ్)ను లాగేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.

కర్ణాటకలోని విజయనగరలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటకలో మా పార్టీ అధికారంలోకి వస్తే భజరంగ్ ధళ్, పీఎఫ్ఐని నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడంపై వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ మీద అదేరోజు కౌంటర్ మొదలు పెట్టారు.

PM Narendra Modi fire

ఇంతకాలం రాముడి మీద పడికొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఆ రాముడే సరైన సమాధానం చెప్పారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు రాముడిని వదిలేసిన కాంగ్రెస్ పార్టీ హనుమంతుడిని పూజించే భజరంగ్ దళ్ ను నిసేధించడానికి సిద్దం అయ్యిందని, అది సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు.

చాలకాలం పాటు రాముడి కారణంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందులు వచ్చాయని, అయితే ఇప్పుడు హనుమంతుడి వలన ఆ పార్టీకి వచ్చిన నష్టం ఏమిటని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. కర్ణాటకోని కోప్పళ జిల్లాలోని అంజనాద్రి కొండ మీద హనుమంతుడు జన్మించాడని కన్నడిగులు నమ్ముతున్నారు ప్రధాని మోదీ చెప్పారు.

అంజనాద్రి కొండ మీద పెద్ద హనుమాన్ గుడి కట్టాని బీజేపీ అనుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి గడ్డ మీద తాను అడుగుపెట్టిన రోజే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని హనుమంతుడిని ఎదిరిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.

PM Narendra Modi fire

హనుమంతుడు ఉండే ఈ గడ్డ మీద పూజలు చెయ్యడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేవుడితో గేమ్స్ ఆడుతున్న కాంగ్రెస్ పార్టీకి కన్నడిగులు తగిన బుద్ది చెప్పాలని, ప్రతిఒక్కరు బీజేపీకి ఓటు వేసి గెలిపించాని ప్రధాని నరేంద్ర మోదీ విజయనరలో జరిగిన బహిరంగ సభలో మనవి చేశారు.

జై భజరంగబలి నినాదాలను అడ్డుకోవడం ఎవరి తరం కాదని, భజరంగ్ దళ్ ను అడ్డుకుంటామని కొందరు పగటి కలలు కంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ కొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

విజయనగరం అంటే ఇప్పటిది కాదని, విజయనగర సామ్రాజ్యం గురించి చరిత్ర గొప్పగా చెప్పుకుంటున్నదని, శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని చరిత్రలో నిలిచిపోయేనా ఆయన పరిపాలించారని, ఇక్కడి ప్రజలు కూడా చాలా గొప్పవారు అని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. విజయనరగ కేంద్రంగా కన్నడిగులకు మనవి చేస్తున్నాను, దయచేసి బీజేపీకి ఓటు వేసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వండి అని ప్రధాని నరేంద్ర మోదీ కన్నడిగులకు మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+