డచ్ టూరిస్టుపై అత్యాచారం: యోగా టీచర్ అరెస్టు

డచ్ యాత్రికురాలిపై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్ జిల్లాకు చెందిన కృష్ణ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. తనపై అత్యాచారం ఆరోపణలు రావడంతో ఢిల్లీకి బయలుదేరిన అతన్ని పోలీసులు గోవా విమానాశ్రయంలో పట్టుకున్నారు.
రష్యన్లు అత్యధికంగా ఇష్టపడే ఉత్తర గోవాలోని మాండ్రెమ్ అనే సముద్ర తీరం గ్రామంలో అతను డచ్ యాత్రికురాలిపై దుర్మార్గానికి ఒడిగట్టాడు. శర్మ గోవాలో యాత్రికులకు యోగా పాఠాలు చెబుతూ వస్తున్నాడు.
అక్టోబర్ నుంచి యోగా తరగతులకు హాజరు కావడానికి డచ్ యాత్రికురాలు యోగా టీచర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications