Yogi Adityanath : యూపీ స్ధానిక సంస్ధలకు యోగీ ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్..

యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత విన్నూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరిగిన స్దానిక సంస్ధల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వాటి బలోపేతం కోసం కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో స్ధానిక సంస్ధలు స్వయం సమృద్ధి సాధించాలని తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు వాటిలో మెరుగైన పనితీరు చూపించే సంస్ధలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని పౌర సంస్థల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు పరస్పర పోటీని ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మంచి పనితీరు కనబరిచిన పురపాలక సంస్ధలకు రివార్డులు ఇస్తామని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ కౌన్సిల్‌లు, నగరపంచాయతీల చైర్మన్‌లకు జరిగిన ఒకరోజు ఓరియంటేషన్ వర్క్‌షాప్‌లో యోగీ పలు ప్రకటనలు చేశారు.

yogi adityanath announces to reward best performing civic bodies

యూపీలో పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు, మంచి రోడ్లు, సురక్షితమైన నగరం, స్వావలంబన అనే ఐదు అంశాల ఆధారంగా పౌర సంస్థల పనితీరును నిర్ణయిస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు వారికి ఇచ్చిన ప్రామాణికాలకు అనుగుణంగా మొదటి స్థానంలో నిలిచిన వారికి రివార్డ్ ఇస్తామని యోగీ వెల్లడించారు.

ఈ ఐదు ప్రామాణిక అంశాల ఆధారంగా జిల్లాలో అగ్రస్థానంలో నిలిచిన నగరపంచాయతీకి కోటి రూపాయలు, డివిజన్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన మున్సిపాలిటీకి రూ.2 కోట్లు, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 10 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+