తాజ్‌పై ముదురుతున్న వివాదం: శివాలయంపై కట్టారని ఆదిత్యనాథ్
న్యూఢిల్లీ: తాజ్ మహల్‌పై వివాదం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యతో ప్రారంభమైన వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది. ఆ మాటల యుద్ధానికి బిజెపి పార్లమెంటు సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ తాజాగా మరింత ఆజ్యం పోశారు. హిందువుల దేవుడైన శివాలయంపై తాజ్‌మహల్‌ను నిర్మించారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజ్ మహల్‌పై సున్నీలకు, షియాలకు ఎవరి వాదనలు వారికి ఉన్నాయని, అయితే అది హిందువుల దేవుడైన శివుడి ఆలయం మీద నిర్మించారని తాము అంటున్నామని, దీనిపై హిందువుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన వాదించారు. నవంబర్ 13న యూపీలో జరిగిన యూపీ రాష్ట్ర సున్నీ కేంద్ర వక్ఫ్‌బోర్డు నిర్వహించిన ముతావలీల సభలో పాల్గొన్న ఎస్పీ నేత ఆజంఖాన్ ఈ వివాదాన్ని రగిలించారు. తాజ్ మహల్‌ను ఉత్తరప్రదేశ్ సున్నీ బోర్డు ఆస్తిగా ప్రకటించుకుని దానికి బోర్డు అధ్యక్షుడినే ముతావలిగా నియమించుకోవాలని, దాని మీద వచ్చే ఆదాయాన్ని ముస్లింల చదువు కోసం వినియోగించాలని తన ప్రసంగంలో అన్నారు.

అయితే, షాజహాన్ ఎవరికోసమైతే ఈ పాలరాతి అద్భుతాన్ని కట్టించాడో ఆ ముంతాజ్ మహల్ షియా అని, అయినా తాజ్ దేశానికి చెందుతుంది కాబట్టి దాన్ని సున్నీలకు, షియాలకు ఎవరికీ అప్పజెప్పవద్దని అబ్బాస్ సూచించారు. అదలావుంటే, తేజోమహాలయ అనే శివాలయంలో కొంత భూమిని రాజా జై సింగ్ నుంచి కొన్న షాజహాన్ అక్కడ తాజ్‌మహల్‌ను కట్టాడని యూపీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ అన్నారు. అది పురావస్తు శాఖకు చెందిదని, కాబట్టి దాన్ని వక్ఫ్‌బోర్డుకు ఇవ్వకూడదని లక్ష్మీకాంత్ డిమాండ్ చేశారు.
తాజ్ మహల్ ఎవరికి చెందుతుందని ఇటీవల లోకసభలో హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేసింది.












Click it and Unblock the Notifications