ప్రజలకు భద్రత, తుపాకీని నమ్ముకునే వారికి మాత్రం దాంతోనే సమాధానం: యోగి ఆదిత్యనాథ్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ భద్రత ప్రభుత్వం లక్ష్యమని, అందరికీ భద్రత కచ్చితంగా ఉంటుందని, కానీ ఎవరైతే సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తారో, తుపాకీనే నమ్ముతారో, వారికి అదే భాషలో సమాధానం చెబుతామన్నారు.

భద్రత విషయంలో ప్రజలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. తుపాకీనీ నమ్ముకునే వారికి మాత్రం సమాధానం అలాగే ఉంటుందని, అందులో తగ్గేది లేదన్నారు. కాగా, యూపీ అసెంబ్లీలో ఎన్‌కౌంటర్లపై అసెంబ్లీలో విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో యోగి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమ గమనార్హం.

Yogi Adityanath on UP police encounters: Those who believe in language of gun, should be answered in same way

కాగా, యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో 1142 ఎన్‌కౌంటర్లు, 38 మంది క్రిమినల్స్ హతం చోటు చేసుకున్నాయి. గత 25 రోజుల్లో 60 ఎన్‌కౌంటర్లు, ఎనిమిది గ్యాంగ్ స్టర్లను మట్టుబెట్టారు. వీటిపై విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On a day when his government faced strong protests in the Uttar Pradesh Legislative Assembly over police encounters in the state, Chief Minister Yogi Adityanath asserted that criminals in the state should be answered in a language they understood.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి