Yogi Adityanath : ఆ కేసులు త్వరగా తేల్చండి-యోగీ ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు..
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సుపరిపాలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ దిశగా అధికారుల్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా తమ శాఖల్లో అంతర్గత కేసుల వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని అన్ని శాఖలకు యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో యోగీ ఆదేశాలపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలోని వివిధ కోర్టులలో ప్రభుత్వ శాఖల పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించడం చాలా అవసరమని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ఎందుకంటే ఇది శాఖల పనిని ప్రభావితం చేస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ న్యాయవాదులతో పాటు, నిపుణులైన న్యాయవాదుల ప్యానెల్‌ను రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు.అలాగే న్యాయస్థానాలలో సమర్థవంతమైన లాబీయింగ్ కోసం వారిని నియమించాలన్నారు. ఈ న్యాయవాదులకు ఫీజులు కూడా నిర్ణయించాలని ఆదేశాలు ఇచ్చారు.

తన అధికారిక నివాసంలో న్యాయ శాఖను పరిశీలించిన సందర్భంగా యోగి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు యూపీ ప్రభుత్వ ప్రకటన తెలిపింది. సామాన్యుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 జిల్లాల్లో సమీకృత కోర్టు సముదాయాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం యోగీ చెప్పారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి కేటాయించిన రూ.220 కోట్ల కార్పస్ ఫండ్‌ను రూ.500 కోట్లకు పెంచాలని అన్నారు. అనుకోకుండా మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ఈ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందిస్తారు.
అన్ని కోర్టుల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సీఎం యోగీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే, కోర్టుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు. సుపరిపాలనకు బలమైన న్యాయ వ్యవస్థే ఆధారమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, గ్రామ న్యాయాలయాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. తహసీల్ స్థాయిలోనే సామాన్యులకు అందుబాటు ధరలో, సరళంగా, అందుబాటులోకి, సత్వర న్యాయం పొందడం తమ ప్రాధాన్యతగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications