యూపీలో కోటిమంది హిందువుల ఓట్లు గల్లంతు: యోగి ఆదిత్యనాథ్ బిగ్ బాంబ్

ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి కోటి మందికి పైగా హిందూ ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై లక్నోలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతీ బూత్ స్థాయిలో జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితా సవరణపై ఓ బీజేపీ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు ఉండి శాసనసభ ఓటర్ లిస్ట్ లో లేని వారి సంఖ్య సుమారు 66 లక్షలుగా ఉందని వెల్లడించారు. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్న దాదాపు 55 లక్షల మంది పేర్లు కూడా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో కనిపించట్లేదని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

Yogi Adityanath says more than one crore Hindu voters were missing from Uttar Pradesh electoral rolls

అంతేకాకుండా 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల దాదాపు 4.5 లక్షల మంది ఓటర్ల పేర్లు ఇంకా నమోదు కాకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. వీటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి బూత్ స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని బీజేపీ కార్యకర్తలను ఆదేశించారు. బూత్ లెవల్ ఆఫీసర్లను సమన్వయం చేసుకుంటూ అర్హత ఉండి ఓటరు కార్డు లేని వారిని గుర్తించి వెంటనే దరఖాస్తులు చేయించాలని సూచించారు.

రామ్ నే యాదవ్ కో మారా..: యూపీ ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు
రామ్ నే యాదవ్ కో మారా..: యూపీ ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు

ఈ విషయంలో కార్యకర్తలు మాత్రమే కాకుండా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పదాధికారులందరూ క్రియాశీలకంగా వ్యవహరించాలని, తమ పరిధిలో ఓటర్ల జాబితాను పర్యవేక్షించాలని కోరారు. ఓటరు జాబితాలో పేరు లేని వారు, నూతన ఓటర్లు కూడా ఈ విషయంలో పునరాలోచన చేయాలని, వెంటనే తమ పేర్లను నమోదు చేయించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో స్వయంగా తనిఖీ చేసుకోవాలని చెప్పారు.

యూపీ.. నియంతృత్వ రాజ్యం: కలెక్టర్ శాలరీ నుంచి రూ. 5 లక్షలు వసూలు చేయండి: హైకోర్టు ఆదేశం
యూపీ.. నియంతృత్వ రాజ్యం: కలెక్టర్ శాలరీ నుంచి రూ. 5 లక్షలు వసూలు చేయండి: హైకోర్టు ఆదేశం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ఏ ఒక్కరు కూడా తన హక్కును కోల్పోకూడదని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తలు నిరంతరం క్రియాశీలకంగా ఉంటూ అర్హులైన పౌరులకు తమవంతు సహకారం అందించాలని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలోని లోపాలను సరిదిద్దడం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి సమగ్ర జాబితాను సిద్ధం చేయవచ్చని ఆయన గుర్తు చేశారు. గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి నియోజకవర్గంలోనూ దీనిపై ప్రచారం సైతం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు యోగి ఆదిత్యనాథ్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+