యూపీ అభివృద్ధిపై వారు సంతోషంగా లేరు- యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కు ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు అత్యవసరంగా మారింది. 2019లో కేంద్రంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి భారీ ఎత్తున ఎంపీ సీట్లు అందించిన యూపీపై ఈసారి కూడా భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఈసారి కూడా గెలిచి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలని యోగీ భావిస్తున్నారు.
యూపీలో రెండు రోజుల క్రితం స్ధానిక సంస్ధల ఎన్నికల తొలిదశ పోరు జరిగింది. ఇప్పుడు 14వ తేదీన రెండోదశ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న యోగీ ఆదిత్యనాథ్.. స్వయంగా తానే రాష్ట్రమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల ప్రచారంలో యోగీ చేస్తున్న వ్యాఖ్యలు కూడా జాతీయ స్ధాయిలో బీజేపీకి కూడా పనికొచ్చేలా ఉన్నాయి. తాజాగా మరోసారి యోగీ ఆదిత్యనాథ్ విపక్షాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

కుటుంబ పార్టీలకు, తపంచా పార్టీలకు యూపీలో అభివృద్ధి సంతోషాన్ని ఇవ్వడం లేదని యోగీ ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్రంలో గ్యాంగ్ స్టర్లు, వారి కుటుంబ సభ్యుల వరుస ఎన్ కౌంటర్లు, హత్యల తర్వాత శాంతి భద్రతల్ని అదుపులో ఉంచడం కోసమే వీటిని చేస్తున్నట్లు యోగీ ప్రచారంలో చెప్తున్నారు. అలాగే విపక్ష పార్టీలు గతంలో అధికారంలో ఉన్న సమయంలో పరిస్ధితులు ఎలా ఉండేవో గుర్తుచేస్తున్నారు.
హపుర్, మీరట్, బులంద్ షహర్, ఘజియాబాద్ లో రెండో దశ స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగీ ఆదిత్యనాథ్.. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఎస్పీ, కాంగ్రెస్ వంటి పార్టీల కుటుంబ పాలనతో పాటు వారి ప్రభుత్వాల హయంలో శాంతి భద్రతల పరిస్ధితుల్ని గుర్తుచేస్తూ యోగీ ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వాలు హజ్ హౌస్ లు, శ్మశానాల కోసం నిధులు ఖర్చుబెడితే తాను మాత్రం ఘజియాబాద్ లో మానసరోవర్ భవన్ కోసం ఖర్చుపెట్టినట్లు యోగీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications