క్రిమినల్స్‌ను ఏరిపారేసే ప్రక్రియ ప్రారంభమైంది..ఇక కాస్కోండి..!

లక్నో: రాష్ట్రంలో క్రిమినల్స్‌ను మాఫియాను అణగదొక్కుతామని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ మేరకు చర్యలు ప్రారంభించిందని రాష్ట్రమంత్రి జేపీఎస్ రాథోడ్ స్పష్టం చేశారు.క్రిమినల్స్‌ను అంతమొందించే కార్యక్రమం రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిదని చెప్పారు. రాష్ట్రాన్ని షేక్ చేసిన ఉమేష్ పాల్ హత్య విషయంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బాజ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఈ ఘటన జరిగిన ఒక్క రోజుకే రాష్ట్ర మంత్రి ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్‌ను అతని నివాసం బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన విషయంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో క్రిమినల్స్ ఏరిపారేసి మట్టిలో కలిపేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లో క్రిమినల్స్ అనే వారు లేకుండా చేస్తామని చెప్పిన యోగీ... ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎవరినైనా తమ ప్రభుత్వం విడిచిపెట్టదని తీవ్రంగా హెచ్చరించారు.

Yogi govt has started the process of eliminating criminals, says Minister Rathore

ఇక వికాస్ దూబే మృతిపై మాట్లాడిన మంత్రి రాథోడ్...ప్రయాగ్‌ రాజ్‌లో ఏమైందో చూశారుగా అని అన్నారు. క్రిమినల్స్ అందరూ దొరకనంత వరకు దొరలే అని చెప్పిన మంత్రి.. ఒక్కసారి దొరికితే మాత్రం పోలీసు వాహనంలో తీసుకెళుతుండగా ఆ వాహనం బోల్తా పడిందని చెబుతూ ఏడవ కూడదని అన్నారు. వికాస్ దూబే ఉజ్జయినీ నుంచి కాన్‌పూర్‌కు పోలీస్ కాన్వాయ్‌లో తీసుకొస్తుండగా కాన్వాయ్‌లోని ఓ వాహనం గతి తప్పడంతో..ఇదే అదునుగా భావించిన దూబే.. పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని వారిపై కాల్పులకు దిగాడు. దీంతో ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందాడు. ఇదిలా ఉంటే ఉమేష్ పాల్ హత్యతో ఒక్కసారిగా రాష్ట్రం వణికిపోయింది. ఈ హత్యకు సంబంధించి ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+