Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UP Elections 2022: గుక్కెడు నీళ్ళకోసం ప్రజలను ఏడిపించిన పార్టీలను ఓటుకోసం ఏడిపించండి: యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది నువ్వా నేనా అన్నట్టు అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో అధికారం చేజిక్కించుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుంటే బిజెపి ని గద్దె దించడం కోసం ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఆదివారం రోజు ఉత్తర ప్రదేశ్ లో మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు.

Recommended Video

    Uttar Pradesh Elections 2022:PM Modi చరిష్మా గట్టెక్కించేనా ? | Yogi Adityanath | Oneindia Telugu

    నీటి కోసం ప్రజలను ఏడిపించిన పార్టీలను ఓటు కోసం ఏడిపించండి : యోగి

    నీటి కోసం ప్రజలను ఏడిపించిన పార్టీలను ఓటు కోసం ఏడిపించండి : యోగి

    బుందేల్‌ఖండ్‌లో తన రెండు రోజుల ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా రెండవ రోజు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఝాన్సీలో రెండు ర్యాలీలలో ప్రసంగించారు. ఒకటి బబినాలో మరియు మరొకటి గుర్సరాయ్‌లో ప్రసంగించిన ఆయన ఉత్తరప్రదేశ్లో ప్రజల భద్రత మరియు నీటి సమస్యలపై ప్రతిపక్షాలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. 70 ఏళ్లుగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్‌లు ఒక్క నీటి చుక్క కోసం ప్రజలను ఏడిపించాయని, ఇప్పుడు ఒక్క ఓటు కోసం వారిని ఏడిపించాల్సిన సమయం ఆసన్నమైంది అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు గతంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నీటి సమస్యను గుర్తు చేశారు.

     త్వరలో బుందేల్ ఖండ్ లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు

    త్వరలో బుందేల్ ఖండ్ లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు

    నీళ్ల కోసం ప్రజలను ఏడిపించిన వారిని, ఇప్పుడు ఓటు విషయంలో ఏడిపించవలసిన సమయమని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ నల్ యోజన పథకం కింద బుందేల్‌ఖండ్‌లోని ప్రతి ఇంటికి పంపు నీటిని సరఫరా చేయడాన్ని త్వరలో ప్రారంభిస్తుందని, ఇది ఆర్వో నీటి కంటే మెరుగైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత కారణంగా ప్రజలు ఇక్కడి యువతను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో బుందేల్‌ఖండ్‌లోని చాలా మంది యువత అవివాహితులుగా మిగిలిపోయారు. కానీ ఇప్పుడు ఈ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతి త్వరలో నీరు వారి ఇళ్లకు చేరుకుంటాయని యోగి తెలిపారు.

    గత ప్రభుత్వాలు నీటి సమస్య పరిష్కారం చెయ్యలేకపోయాయన్న యోగి

    గత ప్రభుత్వాలు నీటి సమస్య పరిష్కారం చెయ్యలేకపోయాయన్న యోగి

    ఇతర పార్టీలు, గత ప్రభుత్వాలు ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడానికి ఏమీ చేయలేదని యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైలులో పంపిన నీటిని కూడా వారు తిరస్కరించారని పేర్కొన్నారు. అయితే తాము ఇప్పటికే డజనుకు పైగా ప్రాజెక్టులను పూర్తి చేసామని వెల్లడించారు మరియు కెన్ బెత్వా నదిని అనుసంధానించే ప్రాజెక్ట్ ప్రారంభించామని తెలిపారు. ఇది ఈ ప్రాంతాన్ని మార్చడానికి ఉపయోగపడుతుందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

     కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్న ప్రతిపక్షాలు .. కానీ బీజేపీ ప్రజలకు అండగా

    కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్న ప్రతిపక్షాలు .. కానీ బీజేపీ ప్రజలకు అండగా

    కోవిడ్ మహమ్మారి సమయంలో, ప్రతిపక్ష నాయకులు మరియు వారి కార్యకర్తలు తమ ఇళ్లలో దాక్కున్నప్పుడు ఉచిత చెకప్, చికిత్స మరియు టీకాలు వేయించింది బిజెపి అని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. కష్ట సమయాల్లో మనతో ఉన్నవారిని మనమందరం గుర్తుంచుకుంటామని, వారు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషులు, మిగిలిన వారు ప్రతిపక్ష పార్టీల వలె అవకాశవాదులు అని ఆయన ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

    ఎస్పీ కరోనా సమయంలో అధికారంలో ఉంటే వ్యాక్సిన్లు కూడా అమ్ముకునేది

    ఎస్పీ కరోనా సమయంలో అధికారంలో ఉంటే వ్యాక్సిన్లు కూడా అమ్ముకునేది

    ఎస్పీ హయాంలో ఈ మహమ్మారి విజృంభించి ఉంటే, మోదీ ప్రభుత్వం వారికి పంపిన వ్యాక్సిన్‌లను వారు విక్రయించి ఉండేవారు అని యోగి ఆరోపణలు గుప్పించారు. సమాజ్‌వాదీ పార్టీ కేవలం దోపిడీని నమ్ముకుంటోందని, అయితే మా ప్రభుత్వం మాఫియా కోసం ఒక చేతిలో కర్ర పట్టుకొని, మరో చేతిలో బుల్‌డోజర్‌ స్టీరింగ్‌తో పాలన సాగిస్తున్నదని సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు.

     డబ్బు దోపిడీ చెయ్యటమే ఆ పార్టీల పని

    డబ్బు దోపిడీ చెయ్యటమే ఆ పార్టీల పని

    ఇప్పటి వరకు, మేము 64,000 హెక్టార్ల భూమిని మాఫియా బారి నుండి కాపాడామని, 2,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసామని పేర్కొన్నారు . వారు పేరుకు మాత్రమే సమాజ్‌వాది, కానీ వారి పని 'తమంచవాదీ ' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు దోపిడీ చేయడం మాత్రమే తెలిసిన 'పరివార్‌వాదీ ' ఆలోచనా విధానం అని యోగి అధిత్యనాథ్ మండిపడ్డారు. కన్యా సుమంగళ యోజన లబ్ధిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని నిర్ణయించామని, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.51 వేల బదులు రూ.లక్ష ఇస్తామని ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+