వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ నిర్ణయం కోసం యువ భారతం ఎదురుచూస్తోంది: జైట్లీకి రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ విషయమై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీపై సవాల్ విసిరారు. దీని విషయంలో తాను గడువు ఇచ్చానని, అది దగ్గర పడుతోందని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

ప్రియమైన జైట్లీ గారు.. మీకు నేను ఇచ్చిన డెడ్‌లైన్‌కు ఇంకా ఆరు గంటల కన్నా తక్కువ సమయమే ఉందని, మీ నిర్ణయం కోసం యువ భారతం ఎదురుచూస్తోందని, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ గారిని ఒప్పించడంలో మీరు బిజీగా ఉంటారని అనుకుంటున్నానని పేర్కొన్నారు.

You Have Less Than 6 Hours: Rahul Gandhi Tweets Arun Jaitley On Rafale

రాఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తోందంటూ జైట్లీ విమర్శలు గుప్పించారు. దీంతో వాటిని తిప్పికొడుతూ రాహుల్‌ బుధవారం ఓ ట్వీట్‌ చేశారు. అందులో రాఫెల్‌ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేయాలన్నారు. దీనిపై ఇరవై నాలుగు గంటల్లోగా స్పందించాలన్నారు.

జైట్లీ గారు.. మహా రాఫెల్‌ దోపిడీపై దేశం దృష్టిని మళ్లించినందుకు మీకు ధన్యవాదాలని, దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేస్తే ఎలా ఉంటుందని, సమస్య ఏమిటంటే మీ సుప్రీం లీడరే ఆయన స్నేహితుడిని రక్షిస్తున్నారని, అందువల్ల ఇది సాధ్యపడదేమోనని, దీనిపై మీరు మరోసారి పునఃపరిశీలించుకొని ఇరవై నాలుగు గంటల్లోగా దనిపై స్పందించాలని, ఎదురుచూస్తుంటామని పేర్కొన్నారు. బుధవారం చేసిన సవాల్‌కు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో రాహుల్ మరోసారి ట్వీట్ చేశారు.

English summary
In the back and forth over the Rafale jet deal, Rahul Gandhi today posted a tart reminder to Finance Minister Arun Jaitley with six hours left in his 24 hour deadline to set up an all-party lawmakers' panel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X