స్నేహితులని నమ్మి సినిమాకి వెళ్తే... యువ డాక్టర్ పై నలుగురు మానవ మృగాల దాడి
మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ యువ వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే
వేలూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న ఓ యువతి మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి కాట్పాడి లోని సినిమా థియేటర్ కు సినిమా చూడ్డం కోసం వెళ్ళింది. సినిమా చూసిన అనంతరం స్నేహితులతో వేలూరు షేర్ ఆటోలో బయలుదేరింది వైద్యురాలు. స్నేహితులని నమ్మి వారితో కలిసి ప్రయాణం చేసినందుకు ఆమెకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆటోను సత్ వచ్చారిలోని మరో రోడ్డుకి మళ్ళించారు ఆటోలోని నలుగురు యువకులు. ఇక యువతి ఎటు తీసుకువెళుతున్నావ్ అంటూ ఆటో డ్రైవర్ ని నిలదీసినా ఆమె మాటలు పట్టించుకోకుండా ఆటోను పాలేరు నది ఒడ్డుకు తీసుకెళ్లారు.

ఇక యువతి పక్కనే స్నేహితుడు ఉన్నప్పటికీ అతను కూడా యువతిని కాపాడలేకపోయాడు. యువతి స్నేహితుడిపై దాడి చేసి బెదిరించి అక్కడి నుంచి తరిమేసిన మిగతా వాళ్ళు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేసినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి పరారీలో ఉన్న నలుగురు మానవ మృగాల కోసం వేట ప్రారంభించారు. ఇప్పటివరకు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
స్నేహితులని నమ్మి వారితో కలిసి రాత్రి సమయంలో సినిమాకి వెళ్లినందుకు యువత జీవితం అన్యాయంగా బలి అయిపోయింది. కామాంధుల కామవాంఛకు యువతి తన మాణాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. స్నేహం చేయడం తప్పు కాదు కానీ స్నేహం చేసే విషయంలో అవతలి వ్యక్తులు ఎలాంటి వారు అనేది తెలుసుకోకపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. కనీస నైతిక విలువలు లేని వారితో స్నేహం చేసి, వారితో కలిసి సెకండ్ షో సినిమా కి వెళ్ళిన ఖర్మానికి యువతి నష్టపోవాల్సి వచ్చింది. కనుక అమ్మాయిలు స్నేహం చేసే విషయంలో తస్మాత్ జాగ్రత్త!!












Click it and Unblock the Notifications