చిన్నమ్మ, మామ అక్రమ సంబంధం: యువకుడికి వేధింపులు, ఫేస్ బుక్ లో డెత్ నోట్, సూసైడ్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కుటుంబ సభ్యుల్లోని ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని గుర్తించిన యువకుడిని పెద్దలు వేధించడంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సిన పెద్దలు ఓ యువకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు.

కర్ణాటకలోని మైసూరు తాలుకాలోని డి. సాలుండి గ్రామంలో నవీన్ నాయక్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. నవీన్ నాయక్ చిన్నమ్మ, మామ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. చిన్నమ్మ, మామ వివాహేతర సంబంధం నవీన్ నాయక్ కు తెలిసిపోయింది.

Young man commit suside near Mysuru

విషయం తెలుసుకున్న నవీన్ నాయక్ మీ పద్దతి మార్చుకోవాలని లేదంటే కుటుంబ సభ్యులు అందరికీ చెప్పేస్తానని చిన్నమ్మ, మామలను హెచ్చరించాడు. అప్పటి నుంచి చిన్నమ్మ, మామ కలిసి ప్రతి రోజు ఏదో ఒకరీతిలో నవీన్ నాయక్ ను తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేశారు.

చిన్నమ్మ, మామల వేధింపులు తట్టుకోలేని నవీన్ నాయక్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. ఆరు పేజీల డెత్ నోట్ లో చిన్నమ్మ, మామల వివాహేతర సంబంధం గురించి వివరించాడు. వారి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఫేస్ బుక్ లో డెత్ నోట్ పోస్టు చేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నవీన్ నాయక్ మృతదేహాన్ని తీసుకుని అంత్యక్రియలు చెయ్యడానికి కుటుంబ సభ్యులు వెలుతున్న సమయంలో పోలీసులు అక్కడి చేరుకుని అడ్డుకున్నారు. మృతదేహాన్ని మైసూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టుం చేయించారు. నవీన్ నాయక్ చిన్నమ్మ, మామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Young man commit suside near Mysuru in Karnataka

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి