• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రేమిస్తే సినిమా సీన్ రిపీట్: ప్రేమ జంటను నమ్మించి ఇంటికి పిలిచి .. సుత్తి, రాడ్లతో యువకుడిపై దాడి

|

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమిస్తే సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారడంతో, కుటుంబ సభ్యులు వారి ప్రేమకు అడ్డుగా నిలవడంతో, ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయిన ఓ జంట ఒకటైంది . ఇంటి నుంచి పారిపోయి వేరే ప్రాంతంలో ఇద్దరూ కలిసి జీవనం సాగిస్తున్న క్రమంలో వారిని ఏమీ అనమని, ఇంటికి రావాలని మాయమాటలు చెప్పి, సంప్రదింపులు చేసి తీరా గ్రామానికి వచ్చిన తర్వాత సుత్తులతో, రాడ్లతో యువకుడిపై దాడి చేసిన ఘటన స్థానికంగా షాక్ కు గురి చేసింది.

మధ్యప్రదేశ్ లో లవ్ స్టోరీ ... ఇంటి నుండి పారిపోయిన ప్రేమ జంట
మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలోని జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే 22 సంవత్సరాల పుష్పక్ భవసర్ మక్సీ లో నివసిస్తున్న 22 ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే కుటుంబాలలో వారిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చని కారణంగా, ఎవరికీ చెప్పకుండా ఇద్దరూ కలిసి ఇళ్ల నుండి పారిపోయి, వేరే చోట ఒకటిగా జీవనం సాగిస్తున్నారు. వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వారితో మాట్లాడి రాజీ కుదిర్చి, నచ్చజెప్పి ఇంటికి రమ్మని పిలిచారు. వారి మాటలు నమ్మి తీరా ఇంటికి వచ్చాక ఊహించని పరిణామం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది.

young man was brutally beaten up by woman family over their love affair

తిరిగి ఇంటికి రప్పించి సుత్తి, రాడ్లతో యువకుడిపై దాడి చేసిన యువతి కుటుంబం
కుమార్తెను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని ఆగ్రహంతో ఉన్న మహిళ తండ్రి మరియు సోదరుడు విచక్షణ రహితంగా సుత్తి మరియు రాళ్లతో దాడి చేసి ఆ యువకుడిని దారుణంగా కొట్టారు. ఈ సంఘటన చూసిన వారు ఇద్దరిని ఆపటానికి ప్రయత్నించినప్పటికీ వారు తీవ్రమైన ఆగ్రహంతో యువకుడిపై దాడి చేశారు. కొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. యువతి తండ్రితోపాటు సోదరుడు అతని కాళ్ళు, చేతులపై సుత్తి మరియు రాడ్లతో బలంగా కొట్టినట్టు ఈ వీడియోను బట్టి తెలుస్తుంది. ఈ దాడిలో పుష్పక్ చెయ్యి విరగడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

దాడి చేసిన వారిపై, బాధితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు .. ఎస్పీని కలిసిన బాధిత కుటుంబం
సంఘటన జరిగిన వెంటనే, మాక్సీ పోలీసులు యువకుడిపై దాడికి పాల్పడిన నిందితులు మరియు పుష్పక్ భవసర్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసు కేసుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పుష్పక్ భవసర్ కుటుంబం మరియు భవసర్ కమ్యూనిటీ సభ్యులు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకుని, తమకు న్యాయం కావాలని వినతి పత్రం సమర్పించారు. ఘోరమైన దాడి జరిగినప్పటికీ నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

కటింగ్ చేయించుకోవటానికి బయటకు వెళ్ళిన క్రమంలో దాడి
అతను మార్కెట్‌కి కటింగ్ చేయించుకోవడానికి వెళ్లాడని, అక్కడ యువతి తండ్రి, సోదరుడు షాప్ లో ఉన్న పుష్పక్ ను బయటకు లాగి మరీ వారు అతడిని కొట్టారని , అతని కాళ్లు మరియు చేతులపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు అని వారు అతనిని చంపాలనే ఉద్దేశ్యంతో వచ్చారని ఆరోపిస్తున్నారు. పుష్పక్ పైన దాడి చేసిన వీడియో ఉన్నప్పటికీ పోలీసులు, పుష్పక్ పైన కూడా కేసు నమోదు చేయడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాదితుడిపైనే కేసు పెట్టటం ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు.

English summary
The incident took place in Shahjapur district of Madhya Pradesh when 22-year-old Pushpak Bhavsar fell in love with a 22-year-old woman living in Maxi. However, because the two families do not like the love affair, the two run away from home together without telling anyone and live as one elsewhere. After persuading them and bringing them home, the young man's father and brother indiscriminately attacked the young man with hammers and rods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X