ఏక్తా: ఆలయాలను శుభ్రం చేసిన ముస్లింలు(ఫొటోలు)
చెన్నై: ఇటీవల చెన్నై నగరంలో వరదలు సృష్టించిన బీభత్సం.. ఎన్నో మానవీయ ఘటనలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి మతంతో సంబంధం లేదని చాటుకుంటున్నారు ప్రజలు. కులమతాలు రాజకీయ నాయకులకే తప్ప సామాన్య ప్రజలకు పట్టవని మరోసారి నిరూపించారు.
మంగళ, బుధవారాల్లో వర్షం కాస్త తెరిపిచ్చిన క్రమంలో పలువురు ముస్లిం యువకులు నగరంలోని మసీదులతో పాటు హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేశారు. వరదల కారణంగా మసీదులు, ఆలయాలు అపరిశుభ్రంగా మారడంతో శుభ్రం చేసేందుకు పూనుకున్నామని ముస్లిం యువకులు తెలిపారు. రహదారులను కూడా శుభ్రం చేస్తామని చెప్పారు.
A Great example of humanity: Muslim youth clean flood-hit temples in #ChennaiFloods.
Read https://t.co/VmrGJxU7bz pic.twitter.com/kgrIajAdqT
— Prasar Bharati (@prasarbharati) December 8, 2015 రెండ్రోజుల క్రితం ఓ ముస్లిం యువకుడు నీటిలో చిక్కుకున్న హిందూ కుటుంబానికి చెందిన ఓ నిండు చూలాలును సకాలంలో ఆస్పత్రికి చేర్చడం, అక్కడ ఆమె బిడ్డను సుఖంగా ప్రసవించడం, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ బిడ్డను యూనస్ అని ఆ ముస్లిం యువకుడి పేరును పెట్టుకోవడం తెలిసిందే.
Indian Muslims believe difference in religion isn't an excuse to not help some1. Masjid helps #ChennaiFloods victims pic.twitter.com/QBTbuGFgnd
— Chinmay Sane (@Sane_Chin) December 5, 2015 పలు మసీదులు హిందువులకు మంచినీరు అందించగా, బాధితులకు ఆహారం అందించేందుకు హిందూ ఆలయాలు ముందుకు వచ్చాయి. పలువురు ముస్లింలు హిందూ ఆలయాల్లో వంటలు చేసి మతాలకతీతంగా బాధితులందరికీ ఆహార పదార్థాలను అందజేశారు. కాగా, హిందూ ఆలయాల్లో వండిన ఆహార పదార్థాలను క్రైస్తవులు బాధితులకు అందజేశారు.
Muslims in Chennai helping their non Muslim Neighbours #ChennaiFloods #ChennaiRainsHelp #ThisIsIslam #MadeInIndia pic.twitter.com/TfWrRz1g5G
— Mission Dawah India (@MissionDawahInd) December 9, 2015 చెన్నై వరదల్లో ప్రజలకు సహాయంగా సోషల్ మీడియా కూడా అద్భుత పాత్రను నిర్వహించింది. బాధితుల సమాచారం ప్రభుత్వాధికారులకు చేరవేయడం, సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అన్నార్తులకు ఆశ్రయం కల్పించడం, ఆపదులను ఆదుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగారు. అలాగే మసీదులు, ఆలయాలు, చర్చిలు మతాలతో సంబంధం లేకుండా బాధితులందరికీ ఆశ్రయం కల్పించాయి.
1/2 Muslims inside a Hindu Temple cooking food for #ChennaiRains #ChennaiFloods, Christians distributing it... pic.twitter.com/fz2HHRQ93R
— Lingeshan R (@Lingeshan) December 5, 2015 ఇలాంటి సందర్భంలో ముస్లిం యువకులు దేవాలయాలను శుభ్రం చేయడంపై ‘ప్రసార భారతి' ట్వీట్టర్‌లో స్పందించింది. ‘ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమానిటీ' అని వ్యాఖ్యానించింది. కాగా, ఇది అరుదైన విషయం కాదని, వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా భారతీయులంతా ఒకరికొకరు అండగా నిలుస్తారని, ప్రజలను కులమతాల పేరిట విడదీసేది రాజకీయ నాయకులేనని పలువురు ట్వీట్లు చేశారు.












Click it and Unblock the Notifications