బస్సులో అమ్మాయి దుప్పటి కప్పుకుందని దానిని లాగితే!

ద్రావకం తాగి, బస్సులోనే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన తమిళనాడులో జరిగింది.బస్సులోని ప్రయాణికులు అందరూ దిగగా ఓ యువతి మాత్రం నిద్ర పోవడాన్ని కండక్టర్‌ గమనించాడు.

చెన్నై: ద్రావకం తాగి, బస్సులోనే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన తమిళనాడులో జరిగింది. నీలగిరి జిల్లా ఊటీ నుంచి ప్రభుత్వ ఏసీ బస్సు శనివారం రాత్రి బయల్దేరి ఆదివారం ఉదయం నాగర్‌ కోయిల్‌కు చేరుకుంది.

బస్సులోని ప్రయాణికులు అందరూ దిగగా ఓ యువతి మాత్రం నిద్ర పోవడాన్ని కండక్టర్‌ గమనించాడు. ఆమె దుప్పటి కప్పుకొంది. ఆమెను లేపేందుకు ప్రయత్నించిన కండక్టర్‌ దుప్పటి లాగారు.

Young woman from Coimbatore found dead in bus

ఆమె నోరు, ముక్కు నుంచి నురగలు రావడం గమనించి షాకయ్యాడు. వెంటనే వడచ్చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆమె బ్యాగును పరిశీలించిన పోలీసులు అందులోని గుర్తింపు కార్డు ద్వారా ఆ యువతి కోయంబత్తూర్‌ జిల్లా శెట్టియార్‌తోటం గ్రామానికి చెందిన ముత్తుసెల్వి (22)గా గుర్తించారు.

కోయంబత్తూర్‌లోని ఓ నగల దుకాణంలో పని చేస్తున్న ఆమె వారం క్రితం బంధువు వివాహం కోసమని సెలవు తీసుకుంది. అనంతరం మరో రెండు రోజులు సెలవు పొడిగించుకుందని, దుకాణంలో ఆమె పని చేస్తున్న విభాగం నుంచి వేరే విభాగానికి మార్చడంతో మనస్తాపం చెందిందని, ఆమె వెళ్లే సమయంలో విషపూరిత ద్రావకం తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఆమెకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న విభేదాలతో ఆమె ఆత్మహత్యకు పాల్ప డిందా? లేక మరేదైనా కారణముందా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+