కోల్‌కతా యువతి కిడ్నాప్: సామూహిక అత్యాచారం

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాకు చెందిన ఆ యువతి ఉద్యోగం కోసమని జులై 28న జైపూర్ వచ్చింది. ఇక్కడే ఓ హోటల్‌లో బస చేసింది. కాగా, ఆమె అజ్మీర్ వెళ్లాలని నిర్ణయించుకుని, ఓ టాక్సీలో జులై 30న బయల్దేరింది.
అదే సమయంలో ఏడు నుంచి ఎనిమిది మంది దుండగులు ఆమె ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. ఆ తర్వాత ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎవరూ ఉండనటువంటి ఓ పాత ఇంట్లోకి తీసుకెళ్లిన నలుగురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడరు.
అనంతరం దుండగులు పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, సదర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేసుకున్నారు. నిందితులలో విక్కీ(25), అశోక్(22) అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మిగితా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications