వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శతాధిక వృద్ధుల్లో వెల్లివిరిసిన చైతన్యం.. పోలింగ్ స్టేషన్ల వద్ద వృద్ధుల బారులు...

|
Google Oneindia TeluguNews

ఓటు.. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం. తమకు నచ్చిన ఎన్నుకొనే హక్కు ప్రతి వయోజనుడికి ఉంది. కానీ ప్రస్తుతం ఎన్నికలు అంటే యువత ఆసక్తి చూపని పరిస్థితి ఉంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే వృద్ధులు మాత్రం ఓటేసేందుకు బారులు తీరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సోమవారం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా 51 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

సర్వే సందడి: మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఈ పార్టీలే..!సర్వే సందడి: మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఈ పార్టీలే..!

క్యూ లైన్లలో వృద్ధులు..

అసెంబ్లీ ఎన్నికలకు వృద్ధులు బారులు తీరడం శుభపరిణామం. వీరు సాధారణంగా 60, 70 ఏళ్లు ఉన్న వారు కాదు.. ఏకంగా 100 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. బల్హా నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. బహరేచ్ వద్ద 106 సంవత్సరాల హర్ష్ సింగ్ ఓటేసేందుకు బారులు తీశాడు. క్యూ లైన్‌లో నిల్చొని మరీ ఓటు వేశారు. తనను ఎన్నికల అధికారులు పిలువగానే వెళ్లి మరీ ఓటేశారు.

పుణెలో అలీమ్

ఇటు పుణెలో హజీ ఇబ్రహీం అలీమ్ జోద్ కూడా తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈయన వయస్సు 102 సంవత్సరాలు కావడం విశేషం. తన కుటుంబసభ్యులతో కలిసి లోహెగాన్ పోలింగ్ బూత్ వద్దకెళ్లి మరీ ఓటు వేశారు. వాస్తవానికి అలీమ్ ఆరోగ్య పరిస్థితి అంతా బాగోలేదు. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. కానీ ఓటు వేయాలని దవాఖాన నుంచి అలీమ్ వచ్చాడు. మిగతా వారు కూడా వారి ఓట్లను వినియోగించుకోవాలని కోరుతున్నాడు.

93 ఏళ్ల యువకుడు

మరోవైపు ముంబై జుహూలో కూడా 93 ఏళ్ల వృద్ధుడు కన్నాజీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతనిని చూసి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆశ్చర్యపోయారు. కన్నాజీని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. యువత తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. కన్నా జీ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారని అతని కుటుంబసభ్యులు తెలిపారు.

 ప్రశాంతమే..

ప్రశాంతమే..

మహారాష్ట్ర, హర్యానా సహా దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగతుంది. ఇప్పటివరకు ఎలాంటి చెదరుమదురు ఘటనలు జరగలేదు. ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నట్టు ఈసీ అధికారులు పేర్కొన్నారు.

English summary
youth are not intereste but old people are queue in polling booths. mainly 100 years old people are use vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X